Advertisement
Advertisement
Abn logo
Advertisement

రోడ్డుపై కూర్చొని ఆలపాటి రాజా ధర్నా...

గుంటూరు జిల్లా: నర్సరావుపేటలో తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షల కారణంగా ఉద్రిక్తత కొనసాగుతోంది. గుంటూరు, నర్సరావుపేటలో టీడీపీ నేతలను హౌస్ అరెస్టు చేస్తున్నారు. నర్సరావుపేటలో అరవింద్‌బాబును గృహ నిర్బంధం చేశారు. గుంటూరులో మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను హౌస్ అరెస్టు చేశారు. తన నివాసం నుంచి వాకింగ్‌కు వెళుతున్న మాజీ మంత్రి ఆలపాటి రాజాను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన పోలీసుల తీరుకు వ్యతిరేకంగా రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు.

Advertisement
Advertisement