గుంటూరు జిల్లా: పెదకూరపాడు మండలం, బలుసుపాడులో సంక్రాంతి సంబురాలు అంబరాన్ని తాకేలా నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే శంకరరావు ఆధ్వర్యంలో ‘ఊరు-మన సంక్రాంతి’ వేడుకలు కొనసాగుతున్నాయి. రెండోరోజు కార్యక్రమానికి ఎమ్మెల్యే శ్రీదేవి, మద్దాల గిరి హాజరయ్యారు. సింగర్ మధుప్రియ పాటలు జబర్దస్త్ టీమ్ కామెడీతో స్థానికులను అలరించారు. ఈ కార్యక్రమాలు నాలుగు రోజులపాటు జరగనున్నాయి.