Abn logo
Jul 13 2020 @ 12:23PM

గుంటూరు : 15 ఎకరాల చెరువుపై రెండోసారి వేలం పాట

గుంటూరు : జిల్లాలోని వట్టిచెరుకూరు మండలం కోవెలమూడిలోని 15 ఎకరాల చెరువుకు రెండో సారి వేలం పాట నిర్వహిస్తున్నారు. గత నెలలో దేవాదాయశాఖ అధికారులు ఈ చెరువుకు బహిరంగ వేలం పాట నిర్వహించారు. ఈ పాటలో వైసీపీలోని ఒక వర్గం పాటదారులు పాల్గొన్నారు. అయితే.. వేలం పాట ప్రారంభమైన మధ్యలో వచ్చి పాటలో తాము పాల్గొంటామని మరో వర్గం చెప్పడంతో అలా కుదరదని దేవాదాయశాఖ అధికారులు చెప్పారు. దీంతో వేలం పాటలో 35 వేలకు నగదు జమ చేయించుకొని పాట దారునికి అధికారులు బిల్లు ఇచ్చారు.


అయితే.. గత నెల వేలం చెల్లదంటూ నేడు అధికారులు మరోసారి తిరిగి పాట నిర్వహిస్తున్నారు. రాజకీయ వత్తిడి వలన పాట చెల్లదంటున్నారని పాటదారుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ వేలం పాట జరుగుతుండటంతో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Advertisement
Advertisement
Advertisement