Advertisement
Advertisement
Abn logo
Advertisement

వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను పరామర్శించిన టీడీపీ నేతలు

గుంటూరు జిల్లా: పల్నాడులో వైసీపీ దాడిలో గాయపడిన టీడీపీ కార్యకర్తలను ఆ పార్టీ నేతలు ప్రత్తిపాటి పుల్లారావు, యరపతినేని శ్రీనివాసరావు, చదలవాడ అరవింద్ బాబు, శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. ఇటీవల పిడుగురాళ్ల జాతీయ రహాదారిపై టీడీపీ కార్యకర్త సైదాపై వైసీపీ శ్రేణులు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన ఆయనను ఆస్పత్రికి తరలించారు. సైదా కుటుంబానికి టీడీపీ తరపున రూ. 50 వేలు ఆర్థిక సాయం అందజేశారు. దాడులుకు పాల్పడిన వైసీపీ నేతలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని టీడీపీ నేతలు హెచ్చరించారు.

Advertisement
Advertisement