Advertisement
Advertisement
Abn logo
Advertisement

తెనాలి మార్కెట్ యార్డ్ వద్ద ఆలపాటి రాజా ఆందోళన

గుంటూరు: జిల్లాలోని తెనాలి మార్కెట్ యార్డ్ వద్ద మాజీ మంత్రి ఆలపాటి రాజా ఆందోళనకు దిగారు. అకాల వర్షాల తడిసిన ధాన్యాన్ని అధికారులు నిరాకరించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆయన మండిపడ్డారు. రైతులకు నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. వర్షాలకు నష్టపోయిన రైతులకు ప్రభుత్వం  వంద శాతం న్యాయం చేయాలన్నారు. పంట ఎంత నష్టపోతే అంత నష్టపరిహారం వెంటనే చెల్లించాలని అన్నారు. రైతుల నుంచి ఆఖరి  గింజ వరకు ప్రభుత్వం కొనుగోలు చేయలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కొనని పక్షంలో రైతులతో కలిసి ఎంతవరకైన పోరాటం చేసేందుకు సిద్ధమని ఆలపాటి రాజా స్పష్టం చేశారు. 

Advertisement
Advertisement