Advertisement
Advertisement
Abn logo
Advertisement

Guntur: మల్లన్న సన్నిధిలో అన్నాభిషేకం

గుంటూరు: పెదకాకాని మల్లన్న సన్నిధిలో బుధవారం అన్నాభిషేక మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూ మల్లేశ్వరస్వామికి అన్నాభిషేకం చేయడం తన పూర్వజన్మ సుక్రుతమన్నారు. పురాతన దేవాలయల చరిత్రను అందరికీ తెలిసేలా ప్రచారం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కిలారి వెంకట రోశయ్య, ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీమోహన్‌, ఆలయ చైర్మన్‌ శివారెడ్డి, ఈవో రఘునాథరెడ్డి, పాలకవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement