Advertisement
Advertisement
Abn logo
Advertisement

రాంచీలో గప్టిల్ అరుదైన ఘనత.. కోహ్లీ రికార్డు బద్దలు

రాంచీ: భారత్‌తో జరుగుతున్న రెండో టీ20లో న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ రికార్డు సృష్టించాడు. 15 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన గప్టిల్ టీ20ల్లో అత్యధిక పరుగుల రికార్డును బద్దలగొట్టాడు. 14 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద గప్టిల్ ఈ మైలురాయిని చేరుకున్నాడు.


ఇప్పటి వరకు ఈ స్థానంలో విరాట్ కోహ్లీ ఉండగా, ఇప్పుడు గప్టిల్ అతడిని వెనక్కి నెట్టేశాడు. కోహ్లీ 87 టీ20ల్లో 3,227 పరుగులు చేశాడు. మొత్తంగా 3248 పరుగులతో గప్టిల్ అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడి రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా రోహిత్‌శర్మ (3086), అరోన్ ఫించ్ (2608), పాల్ స్టిర్లింగ్ (2570) ఉన్నారు.  

Advertisement
Advertisement