Advertisement
Advertisement
Abn logo
Advertisement

గురజాడ అప్పారావు వర్ధంతి

కర్నూలు(ఎడ్యుకేషన్‌), నవంబరు 30: నగరంలోని కేవీఆర్‌ జూనియర్‌ బాలికల కళాశాలలో మంగళవారం గురజాడ వర్ధంతి సభను ఐద్వా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఐద్వా జిల్లా ఉపాధ్యక్షుడు కేఎస్‌ పద్మ అధ్యక్షతన ‘సమానత్వాన్ని చాటుదాం.. మహిళలపై హింస, అత్యాచారలను అరికడదాం’ అన్న అంశాలపై సదస్సు నిర్వహించారు. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, దాడులను అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్‌ జి.లాలెప్ప కోరారు. శ్రామిక మహిళా సంఘం జిల్లా కార్యదర్శి నిర్మల, ఐద్వా జిల్లా కార్యదర్శి అలివేలు, కళాశాల హిస్టరీ అధ్యాపకురాలు సువర్ణ, ఐద్వా పాతనగర కార్యదర్శి బంగి పద్మ, మహేశ్వరి, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.


పత్తికొండటౌన్‌: మండలంలోని దేవనబండ గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రముఖ కవి గురజాడ అప్పారావు వర్ధంతిని నిర్వహించారు. గురజాడ చిత్రపటానికి అరసం జిల్లా కార్యదర్శి సత్యనారాయణ పూలమాలలు వేసి నివాళి అర్పించారు. ఉపాధ్యాయులు ప్రసాద్‌, సులోచన, లలిత పాల్గొన్నారు. 


వెల్దుర్తి: వెల్దుర్తిలోని గ్రంథాలయంలో గురజాడ అప్పారావు వర్ధంతిని గ్రంథాలయ అధికారి కవితాబాయి ఆధ్వర్యంలో నిర్వహించారు. జడ్పీ  హైస్కూల్‌ విద్యార్థులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement