గురక్‌ కబాబ్‌

ABN , First Publish Date - 2021-06-26T20:44:09+05:30 IST

చికెన్‌ - ఒకటిన్నర కేజీ (రెండు ఫుల్‌ బర్డ్‌లు), మటన్‌ - 400గ్రా, ఉల్లిపాయ జ్యూస్‌ - అర కప్పు, అల్లం జ్యూస్‌ - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, వెజిటబుల్‌ ఆయిల్‌ - 3 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ

గురక్‌ కబాబ్‌

కావలసినవి: చికెన్‌ - ఒకటిన్నర కేజీ (రెండు ఫుల్‌ బర్డ్‌లు), మటన్‌ - 400గ్రా, ఉల్లిపాయ జ్యూస్‌ - అర కప్పు, అల్లం జ్యూస్‌ - పావు కప్పు, ఉప్పు - రుచికి తగినంత, వెజిటబుల్‌ ఆయిల్‌ - 3 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ - ఒకటి, ధనియాల పొడి - ఒక టేబుల్‌స్పూన్‌, అల్లం - ఒకటేబుల్‌స్పూన్‌, కుంకుమపువ్వు - ఒకటిన్నర గ్రాము, పెరుగు - పావుకప్పు, దాల్చినచెక్క - పది, నెయ్యి - అరకప్పు, లవంగాలు - ఒక టీస్పూన్‌, యాలకులు - ఒక టీస్పూన్‌, మిరియాల పొడి - ఒక టీస్పూన్‌.


తయారీ విధానం: ముందుగా చికెన్‌ను ఒక పాత్రలోకి తీసుకుని, ఉల్లిపాయ జ్యూస్‌, అల్లం జ్యూస్‌, కొద్దిగా ఉప్పు వేసి అరగంట పాటు మారినేట్‌ చేసుకోవాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి కొద్దిగా నూనె వేసి వేడి అయ్యాక శుభ్రంగా కడిగి కట్‌ చేసి పెట్టుకున్న మటన్‌, ఉల్లిపాయలు, ధనియాల పొడి, అల్లం, కొద్దిగా ఉప్పు వేసి ముక్కలు మెత్తగా అయ్యే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ ఫుల్‌ బర్డ్‌లో కూరాలి. ఒకచిన్నపాత్రలో పెరుగు, కుంకుమపువ్వు, లవంగాల పొడి, మిరియాలపొడి, యాలకులు పొడి తీసుకుని కలపాలి. ఈ మిశ్రమాన్ని చికెన్‌ కు అంతటా సమంగా అంటేలా పట్టించాలి. స్టవ్‌పై పాన్‌పెట్టి దాల్చినచెక్కను సమంగా పరవాలి. వాటిపై చికెన్‌ ఫుల్‌ బర్డ్‌ను పెట్టి నెయ్యి పోయాలి. మూతపెట్టి ఆవిరిపోకుండా పిండితో సీల్‌ వేయాలి. చిన్నమంటపై నాలుగు గంటలపాటు దమ్‌ చేయాలి. సర్వ్‌ చేసుకునే సమయంలో ముక్కలుగా కట్‌ చేసుకోవాలి.



Updated Date - 2021-06-26T20:44:09+05:30 IST