Abn logo
Apr 10 2021 @ 12:01PM

వ్యాక్సిన్ వేయించుకుంటే బీర్ ఫ్రీ!

దేశంలో కరోనా వైరస్‌ మరోసారి విజృంభిస్తోంది. ప్రతిరోజూ లక్షకు పైగా కేసులు నమోదవుతున్నాయి. మరోవైపు మరణాల సంఖ్యా గణనీయంగానే ఉంది. అయినప్పటికీ వ్యాక్సిన్ వేయించుకునేందుకు ప్రజలు ఆసక్తి చూపించడం లేదు. ఈ నేపథ్యంలో గుర్గావ్‌లోని ఓ రెస్టారెంట్ వినూత్న ఆఫర్ ప్రకటించింది. `టీకా లగావో, బీర్‌ లేజావో` అంటూ టీకా వేయించుకున్న వారికి బీర్ ఉచితంగా ఇస్తామని బంపరాఫర్ ప్రకటించింది. 


హార్యానాలోని గుర్గావ్‌లోని ఇండియన్ గ్రిల్ రూమ్ రెస్టారెంట్ ఈ ఆఫర్‌ ప్రకటించింది. టీకా వేసుకున్న తరువాత ఆ టీకా కార్డు చూపిస్తే ఉచిత బీరును ఆఫర్ చేస్తోంది. ఏప్రిల్ 5 నుంచి వారం రోజుల పాటు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని పేర్కొంది. టీకాలు వేయించుకునేలా ప్రజలను ప్రోత్సహించే ఉద్దేశంతోనే ఈ ఆఫర్ ప్రకటించినట్టు రెస్టారెంట్ యజమాన్యం తెలిపింది. 

Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement