Abn logo
Sep 28 2021 @ 00:06AM

ప్రజాకవి గుర్రం జాషువా

సభలో ప్రసంగిస్తున్న జూపూడి రంగరాజు

గుంటూరు (సాంస్కృతికం), సెప్టెంబరు 27:  సమాజంలోని ఆర్థిక, సామాజిక, అసమానతలపై తన కలబలంతో ఎలుగెత్తి నిరసన చాటిన ప్రజాకవి, అచంచల దేశభక్తుడు గుర్రం జాషువా అని బీజేపీ రాష్ట్ర నాయకుడు జూపూడి రంగరాజు పేర్కొన్నారు. స్థానిక నగరంపాలెంలోని జాషువా విగ్రహం వద్ద 126వ జయంతి వారోత్సవాల్లో భాగంగా 6వ రోజు సోమవారం మహాకవి గుర్రం జాషువా కళాపీఠం ఆధ్వర్యంలో ‘జాషువా సాహిత్యం-సమకాలీనత’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్య అతిథి రంగరాజు మాట్లాడుతూ కులమతాలు మనిషి సృష్టించుకున్న అడ్డుగోడలేనని జాషువా గట్టిగా భావించారన్నారు. ఆయనలోని పాండిత్యాన్ని గుర్తించిన నగర ప్రముఖులు ఏకాదండయ్య పంతులు స్వయంగా గండపెండేరం తొడిగి గజారోహణతో గొప్ప ఊరేగింపు నిర్వహించారని గుర్తుచేశారు. సభకు కళాపీఠం ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ నూతక్కి సతీష్‌ అధ్యక్షత వహించారు. సభలో ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యవర ప్రసాద్‌, గంగోలు శామ్యూల్‌, గ్రంథపాలకుడు సంజీవరావు, కోట మోహనరావు, పరంగి సత్యరాజు, సాల్మనరాజు, కోట మోహనరావు, దోరక రాణి, కమల కుమారి తదితరులు ప్రసంగించారు.