భక్తిశ్రద్ధలతో గురుపూర్ణిమ

ABN , First Publish Date - 2021-07-24T05:30:00+05:30 IST

నగరంలోని షిరిడీసాయి మందిరాలలో గురుపూర్ణిమ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయినాథుడికి విశేష అభిషేకాలు, అర్చనలు, హారతులు జరిగాయి.

భక్తిశ్రద్ధలతో గురుపూర్ణిమ
గాంధీబొమ్మ సెంటర్‌ సమీపంలోని బాబా మందిరంలో సామూహిక సహస్రనామార్చన చేస్తున్న భక్తులు

కిటకిటలాడిన సాయి మందిరాలు

నెల్లూరు(సాంస్కృతికం), జూలై 24 : నగరంలోని షిరిడీసాయి మందిరాలలో గురుపూర్ణిమ వేడుకలు శనివారం భక్తిశ్రద్ధలతో జరిగాయి. సాయినాథుడికి విశేష అభిషేకాలు, అర్చనలు, హారతులు జరిగాయి.

గాంధీబొమ్మ సెంటర్‌లోని బాబా మందిరంలో ఉదయం మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాలు, సామూహిక అష్టోత్తర సహస్రనామ అర్చన జరిగాయి. సాయంత్రం విశేష పుష్పాలంకరణ, ప్రత్యేక పూజలు జరిగాయి. కొవిడ్‌ నిబంధనలు అనుసరిస్తూ పరిమిత సంఖ్యలో భక్తులతో వేడుకలు జరిపారు. ఈనెల 30వరకు ఉత్సవాలు కొనసాగనున్నాయి. 

ఏసీ సుబ్బారెడ్డి కూరగాయల మార్కెట్‌ వద్ద గల సాయిబాబా మందిరంలో అభిషేకాలు, సమస్ర నామార్చన, విశేష పుష్పాలంకరణ అన్నదానం జరిగాయి. 

చైతన్యపురి కాలనీ, లక్ష్మీపురం, బాలాజీనగర్‌, భక్తవత్సలనగర్‌, కావేరినగర్‌, అయ్యప్పగుడి సెంటర్‌లోని షిరిడీ సాయి మందిరాల్లో గురుపూర్ణిమ వేడుకలు జరి గాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబాను దర్శించుకున్నారు.


గురుపాదుకా పూజోత్సవం

నగరంలోని ఆదిశంకర ధ్యాన మందిరంలో శనివారం గురుపౌర్ణమి సందర్భంగా గురు పాదుకా పూజోత్సవం జరిగింది.  చక్రాల వారి ట్రస్ట్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దత్తాత్రేయుడు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి, విద్యారణ్య భారతీస్వామి పాదుకలకు పూజలు, విష్ణు సహస్రనామ పారాయణం చేశారు. ఈ సందర్భంగా చక్రాల లక్ష్మీనరసింహం మాట్లాడుతూ దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, వ్యాస మహర్షి,  ఆది శంకరుడు, సాయినాఽథుడు గురువులుగా పూజింపబడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గోశాలుని కృష్ణారావు, లీలామోహన్‌, ఉదయ్‌కుమార్‌, వేణుగోపాల రావు, నాగరత్నకుమారి, రాధాకుమారి, వెంకట సుబ్బమ్మ పాల్గొన్నారు. 

Updated Date - 2021-07-24T05:30:00+05:30 IST