Abn logo
Jul 24 2021 @ 23:29PM

గురు పౌర్ణమి పూజలు

తాళ్లపూడిలో సాయిబాబాకు అభిషేకం

తాళ్లపూడి, జూలై 24 : మండలంలోని అన్నదేవరపేట, గజ్జరం, వేగేశ్వరపురం, పెద్దేవం, తాళ్లపూడి ఆలయాల్లో సాయిబాబాకు ప్రత్యేక పూజలు చేశారు. గోదావరి నదీ జలాలతో బాబాను అభిషేకించిన అనంతరం. పాలు, పెరుగు, నెయ్యి, గంధం, విభూది. వివిద రకాల పళ్లరసాలతో స్వామివారికి అర్చకులు సుబ్రహ్మణ్యం అభిషేకాలు చేశారు.


కామవరపుకోట: మండలంలో షిరిడీ సాయి మందిరాల వద్ద భక్తులు విశేష పూజలు నిర్వహించారు. తడికలపూడి, రామన్నపాలెం, తూర్పు య డవల్లి, రావికంపాడు, కళ్ళచెరువు, జీలకర్రగూడెం తదితర గ్రామాల్లోని షిరిడీ సాయి మందిరాల వద్ద భక్తులు పూజల్లో పాల్గొన్నారు.