గురు పౌర్ణమి వేళ... షిర్డీ నుంచి బాబా ప్రత్యక్ష దర్శనం!

ABN , First Publish Date - 2021-07-24T12:06:00+05:30 IST

ఈరోజు గురు పౌర్ణిమ. ఈ సందర్భంగా...

గురు పౌర్ణమి వేళ... షిర్డీ నుంచి బాబా ప్రత్యక్ష దర్శనం!

షిర్డీ: ఈరోజు గురు పౌర్ణిమ. ఈ సందర్భంగా షిర్డీసాయిబాబా ఆలయాల్లో భక్తుల సందడి నెలకొంది. సాయినాథుడు కొలువైన మహారాష్ట్రలోని షిర్డీలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత కరోనా కాలంలో వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు షిర్డీ సంస్థాన్ ట్రస్ట్... భక్తులకు ఆలయ ప్రవేశం కల్పించడంలేదు.


అయితే షిర్డీ సాయి దర్బార్ నుంచి బాబాను భక్తులు తమ ఇళ్లలోనే ఉంటూ ప్రత్యక్షంగా దర్శించే అవకాశాన్ని కల్పించారు. జూమ్ యాప్ సాయంతో భక్తులు బాబాను దర్శించుకోవచ్చు. నూర్-ఎ- సాయి సంస్థ ఇందుకు తగిన ఏర్పాట్లు చేసింది. గురుపౌర్ణమి వేడుకల కోసం ఆలయాన్ని పూలతో అందంగా అలంకరించారు. ఉదయం నాలుగున్నరకు హారతి కార్యక్రమం జరిగింది. ఆ తరువాత పలు పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అలాగే సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు.

Updated Date - 2021-07-24T12:06:00+05:30 IST