రామతీర్థంలో ఘనంగా గురు పౌర్ణమి

ABN , First Publish Date - 2021-07-25T05:09:44+05:30 IST

రామతీర్థం రామస్వామి దేవస్ధానంలో గురు పౌర్ణమి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానంలోని సీతారామచంద్రులకు శనివారం అర్చకులు ప్రాతఃకాలార్చాన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హోమం జరిపించారు.

రామతీర్థంలో ఘనంగా గురు పౌర్ణమి
రామతీర్థం దేవస్థానంలో పూజలు చేస్తున్న అర్చకులు

 నెల్లిమర్ల, జూలై 24: రామతీర్థం రామస్వామి దేవస్ధానంలో గురు పౌర్ణమి కల్యాణ వేడుకలు ఘనంగా జరిగాయి. గురుపౌర్ణమిని పురస్కరించుకుని దేవస్థానంలోని సీతారామచంద్రులకు శనివారం అర్చకులు ప్రాతఃకాలార్చాన, బాలభోగం, యాగశాలలో సుందరకాండ హోమం జరిపించారు. సీతారాముల ఉత్సవ విగ్రహా లను ఆస్థాన మండపంలోకి తీసుకువచ్చి కల్యాణం, పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారా ములకు పట్టాభిషేకం, పుష్పార్చన చేపట్టారు. విశాఖపట్టణం , విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన భక్తులు ప్రత్యేక పూజలు చేశారు. కార్యక్రమంలో సహాయ కమిషనర్‌ డీవీవీ ప్రసాద్‌, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. 



Updated Date - 2021-07-25T05:09:44+05:30 IST