May 14 2021 @ 07:47AM

వెండితెర‌పై గురుదేవ్ శ్రీ శ్రీ ర‌విశంక‌ర్ బ‌యోపిక్‌

ఇండియ‌న్ సిల్వ‌ర్ స్క్రీన్‌పై బ‌యోపిక్స్ హ‌వా కొన‌సాగుతూనే ఉంది. ప‌లువురు రాజకీయ నాయ‌కులు, ఆట‌గాళ్లు, సినీ తార‌లు, ఇత‌ర రంగాల్లోని ప్ర‌ముఖుల జీవిత చ‌రిత్ర‌లు సినిమాల రూపంలో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. ఇప్పుడు మ‌న దేశానికి చెందిన ప్ర‌ముఖ ఆధ్యాత్మిక వేత్త గురుదేవ్ శ్రీశ్రీ ర‌విశంక‌ర్ జీవిత‌గాథ రూపొంద‌నుంది. గురువారం గురుదేవ్ శ్రీశ్రీ ర‌విశంక‌ర్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఈ విష‌యాన్ని ప్ర‌క‌టించారు. బ‌యోపిక్ టైటిల్‌ను ఫ్రీ..ఫ్రీ ది అన్‌టోల్డ్ స్టోరి ఆఫ్ గురుదేవ్ శ్రీశ్రీ ర‌వి శంక‌ర్‌ అని ఖరారు చేశారు. ‘‘గురుదేవ్ శ్రీశ్రీ ర‌విశంక‌ర్ బ‌యోపిక్ ద్వారా అందరిలో సానుకూల దృక్ప‌థాన్ని పెంపొందించాల‌నేది మా ల‌క్ష్యం. మాంటో బ‌స్సి ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తారు. 100 దేశాల్లో 21 భాష‌ల్లో సినిమాను రిలీజ్ చేస్తాం’’ అని తెలిపారు.