మన్యంలో గురుకుల కార్యదర్శి పర్యటన

ABN , First Publish Date - 2021-06-20T05:29:41+05:30 IST

రాష్ట్ర గురుకుల కార్యదర్శి డాక్టర్‌ కె.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ శనివారం ఏజెన్సీలో పర్యటించారు. తొలుత స్థానిక గురుకుల పాఠశాలలను సందర్శించి, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణపై ఆరా తీశారు.

మన్యంలో గురుకుల కార్యదర్శి పర్యటన
పాడేరులో నిర్మించే ఏకలవ్య స్కూల్‌ నిర్మాణానికి స్థలాన్ని పరిశీలిస్తున్న గురుకుల రాష్ట్ర కార్యదర్శి శ్రీకాంత్‌ప్రభాకర్‌


ఆన్‌లైన్‌ క్లాస్‌లు సక్రమంగా 

నిర్వహించాలని శ్రీకాంత్‌ ప్రభాకర్‌ ఆదేశం 

పాడేరు, హుకుంపేటలో ఏకలవ్యలకు స్థలాల పరిశీలన 


పాడేరు, జూన్‌ 19: రాష్ట్ర గురుకుల కార్యదర్శి డాక్టర్‌ కె.శ్రీకాంత్‌ ప్రభాకర్‌ శనివారం ఏజెన్సీలో పర్యటించారు. తొలుత స్థానిక గురుకుల పాఠశాలలను సందర్శించి, ఆన్‌లైన్‌ క్లాస్‌ల నిర్వహణపై ఆరా తీశారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌ తరగతులు సక్రమంగా నిర్వహించాలన్నారు. అలాగే విద్యార్థులకు అందించేందుకు సరఫరా చేసిన స్టడీ మెటీరియల్‌ పూర్తి స్థాయిలో పంపిణీ కాకపోవడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. అలాగే గురుకుల పాఠశాలలో స్టోర్‌ రూమ్‌ను పరిశీలించి, సరకుల నిల్వలు సక్రమంగా లేకపోవడంతో ప్రిన్సిపాల్‌ శర్మను మందలించారు. సరకులు పాడవకుండా చూసుకోవాలని సూచించినా.. పట్టించుకోకపోవడం సరికాదన్నారు. అనంతరం ఐటీడీఏ పీవో గోపాలకృష్ణ, ఆర్డీవో కే ఎల్‌.శివజ్యోతిలతో ఐటీడీఏ కార్యాలయంలో ఏకలవ్య పాఠశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాల గురించి చర్చించారు. తర్వాత పాడేరు. హుకుంపేట మండలాల్లో ఏకలవ్య పాఠశాలల నిర్మాణానికి ఎంపిక చేసిన స్థలాలను పరిశీలించారు. ఈకార్యక్రమంలో ఆర్డీవో ఎల్‌.శివజ్యోతి, గురుకులాల కన్వీనర్‌ ప్రిన్సిపాల్‌ కిశోర్‌బాబు, ఇంజనీరింగ్‌ బృందం పాల్గొన్నారు.   

Updated Date - 2021-06-20T05:29:41+05:30 IST