మెట్‌పల్లిలో జయంతి వేడుకలకు హాజరైన సిక్కు యువకులు
మెట్‌పల్లి, నవంబరు 30 : పట్టణంలోని ఆదర్శనగర్‌లో గురునానక్ దేవ్ జీ జయంతి వేడుకలను సిక్కు సోదరులు సోమవారం ఘనంగా నిర్వహిం చారు. గురుద్వార గురు గోబింద్ సింగ్ సాహెబ్ సంఘం ఆధ్వర్యంలో వే డుకలను సిక్కులు జరిపారు. ఉదయమే తమ ఆలయానికి చేరుకొని ఖీర్, పాయాసం వంటకాలను సభ్యులందరికి పంపిణీ చేశారు. సిక్కుల జీవిత చరిత్ర పుస్తకాన్ని గురుద్వార్‌లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మెట్ల చిట్టాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ సింగిరెడ్డి రాజేందర్‌రెడ్డిపాల్గొన్నారు.