Abn logo
Aug 2 2021 @ 21:55PM

రూ.30 వే ల విలువైన గుట్కా ప్యాకెట్ల స్వాధీనం

స్వాధీనం చేసుకున్న గుట్కాలతో సీఐ, ఎస్‌ఐలు

ఒకరి అరెస్టు

కలిగిరి, ఆగస్టు 2: కోడిగుడ్ల వ్యాపారం వెనుక అక్రమంగా గుట్కా అమ్మకాలు సాగిస్తున్న కలిగిరికి చెందిన ఉప్పాళ్ల రమేష్‌ అనే వ్యక్తి వద్ద రూ.30వేల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం చేసుకొని అతడ్ని అరెస్ట్‌ చేసినట్లు సీఐ కె సాంబశివరావు, ఎస్‌ఐ జీ వీరేంద్రబాబు తెలిపారు. సాయిబాబా మందిరం ఎదురుగా, కలిగిరి-కొండాపురం రహదారిలో రెండు దుకాణాల గుట్కా ప్యాకెట్లు పోలీసు అధికారులు స్వాధీనం  చేసుకున్నారు. అదే విధంగా సర్కిల్‌ పరిధిలో ఎక్కడైన అక్రమ మద్యం, గుట్కా అమ్మకాలు జరిగితే ప్రజలు తమకు సమాచరం అందించాలని సీఐ పేర్కొన్నారు.