Advertisement
Advertisement
Abn logo
Advertisement

గుట్కాపై మరో ఏడాదిపాటు నిషేధం

అమరావతి: రాష్ట్రంలో గుట్కా, పాన్ మసాలా సహా పొగాకు ఉత్పత్తులపై మరో ఏడాది పాటు నిషేధం పొడిగిస్తూ ప్రభుత్వ నోటిఫికేషన్ ఇచ్చింది. ఆహార భద్రతా ప్రమాణాల చట్టం నిబంధనల మేరకు 2021 డిసెంబరు 7 నుంచి ఏడాది పాటు గుట్కా ఉత్పత్తులపై నిషేధం పొడిగిస్తున్నట్టు నోటిఫికేషన్‌ను జారీ చేసింది. గుట్కా, పాన్ మసాలాలు, నికోటిన్ ఉత్పత్తులు, నమిలే పొగాకుకు సంబధించి తయారీ, నిల్వ, సరఫరా, రవాణా లాంటి అంశాలపై ఈ నిషేధం వర్తిస్తుందని సర్కార్ పేర్కొంది. 


Advertisement
Advertisement