Abn logo
Sep 25 2021 @ 00:20AM

నిషేధిత గుట్కా పట్టివేత

వివరాలు వెల్లడిస్తున్న డీఎస్పీ కండే శ్రీనివాసరావు, వెనక గుట్కా ప్యాకెట్లు

రూ. 23 లక్షల విలువైన గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్న పోలీసులు

అక్రమ వ్యాపారులపైౖ ప్రత్యేక నిఘా

డీఎస్పీ కండే శ్రీనివాసరావు


కనిగిరి, సెప్టెంబరు 24 : కనిగిరి నగర పంచాయతీ శివారులో అక్రమంగా తరలిస్తున్న రూ.23 లక్షల విలువైన నిషేఽధిత గుట్కా ప్యాకెట్లను సీఐ పాపారావు నేతృత్వంలో ఎస్సై రామిరెడ్డి గురువారం రాత్రి ఆకస్మిక దాడి చేసి పట్టుకున్నారు. ఆ  గుట్కాను స్టేషన్‌కు తరలించారు. డీఎస్పీ కండే శ్రీనివాసరావు శుక్రవారం జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. కనిగిరి మండలం తుమ్మకుంట గ్రామంలో కొంతకాలంగా నిల్వ ఉంచిన గుట్కాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పీసీపల్లి మండలం జంగాలపల్లికి చెందిన కసిరెడ్డి రమే్‌షరెడ్డి, తుమ్మకుంట గ్రామానికి చెందిన ఈర్ల రామకృష్ణలు మరో ఇద్దరు కర్నాటి ఏడుకొండలు, వెంకట కృష్ణారెడ్డిలతో కలసి గుట్కా వ్యాపారం నిర్వహిస్తున్నారు. గురువారం అర్ధరాత్రి కారులో గుట్కాలు తరలిస్తుండగా సీఐ, ఎస్‌ఐలు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ తనిఖీలో 18 గోతాలు లభించాయి. అనుమానం వచ్చిన పోలీసులు తుమ్మకుంట గ్రామంలోని ఈర్ల రామకృష్ణకు చెందిన ఇంట్లో తనిఖీలు చేశారు. అక్కడ 32 గుట్కా ప్యాకెట్‌ బస్తాలు లభ్యమయ్యాయి. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. రాత్రి వేళల్లో కారులో సంచరిస్తూ ప్యాకెట్లను సరఫరా చేస్తుండగా కారును, ఇరువురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న మరో ఇద్దరు కర్నాటి ఏడుకొండలు, వెంకట కృష్ణారెడ్డిలు పరారైనట్లు డీఎస్సీ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పరారైన వారిని పట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు.