Abn logo
Nov 23 2020 @ 00:35AM

రూ. 2లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లు స్వాధీనం

కోదాడటౌన్‌, నవంబరు 22: కోదాడ పట్ణణంలో రూ.2లక్షల విలువైన గుట్కా ప్యాకెట్లను పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్‌ఐ క్రాంతి కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అనంతగిరి మండలం లకారం గ్రామానికి బాడిష నాగేశ్వరరావు, ఖమ్మంకు చెందిన దన్నారపు మాధవరావు కోదాడ పట్టణానికి చెందిన షేక్‌ కరీం, షేక్‌ పాషా, చల్లా నరసింహారావుకు గుట్కా, పాన్‌మసాలా ప్యాకెట్లు విక్రయిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. కేసు నమోదు చేసి  దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు. 


దేవాలయంలో హుండీ చోరీ

చింతలపాలెం నవంబరు 22: చింతలపాలెం మండలకేంద్రంలోని గంగమ్మ దేవాలయంలోని హుండీని దుండగులు ఆదివారం ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం... గుర్తుతెలియని వ్యక్తులు హుండీని పగలగొట్టి నగదును అపహరించారు. దేవాలయ చైర్మన్‌ జంగయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ నవీన్‌కుమార్‌ తెలిపారు


10 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

సూర్యాపేటరూరల్‌, నవంబరు 22: అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్‌ బియ్యా న్ని పోలీసులు ఆదివారం స్వాధీనం చేసుకున్నారు. జనగాం క్రాస్‌ రోడ్డు సమీపం లో నాలుగు ఆటోల్లో తరలిస్తున్న 10 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆటో డ్రైవర్లు గుగులోతు లింగయ్య, భూక్య కుమార్‌, గిరి, నాగు, శివకుమార్‌లపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాస్‌ తెలిపారు. 

Advertisement
Advertisement