‘గుట్ట’కాయస్వాహా!

ABN , First Publish Date - 2022-01-18T05:40:24+05:30 IST

ల్లాలో మొరం అక్రమ దందా జోరుగా సాగు తోంది. అభివృద్ధి మాటున అక్రమార్కులు మొరం మట్టి ని తరలించుకుపోతున్నారు. ప్రజాప్రతినిఽధుల అండ దండలతో ఈ దందా యథేచ్చగా సాగుతోంది.

‘గుట్ట’కాయస్వాహా!
గుండారం గుట్టలో మొరం తవ్వకం చేస్తున్న దృశ్యం

గుండారం గుట్టలో మొరం తవ్వకం చేస్తున్న దృశ్యం
‘గుట్ట’కాయస్వాహా!
అభివృద్ధి మాటున అక్రమ దందా
జిల్లాలో యథేచ్ఛగా మొరం తవ్వకాలు
ప్రజాప్రతినిధుల అండదండలతో కొనసాగుతున్న మొరం రవాణా
కోటగిరి, రుద్రూర్‌, బోధన్‌లో ఇష్టారాజ్యంగా తవ్వకాలు
ఆనవాళ్లు కోల్పోతున్న గుట్టలు, ప్రభుత్వ భూములు
కన్నెత్తి చూడని సంబంధిత అధికారులు

నిజామాబాద్‌, జనవరి 17 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి) :
జిల్లాలో మొరం అక్రమ దందా జోరుగా సాగు తోంది. అభివృద్ధి మాటున అక్రమార్కులు మొరం మట్టి ని తరలించుకుపోతున్నారు. ప్రజాప్రతినిఽధుల అండ దండలతో ఈ దందా యథేచ్చగా సాగుతోంది. దీంతో గుట్టలు, ప్రభుత్వ భూములు ఆనవాళ్లు కోల్పోతున్నా.. సంబంధిత అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు. కొన్ని సార్లు పోలీసులు పట్టుకున్న సంబంధిత అధికారులలో మాత్రం చలనం రావడం లేదు. ఏళ్ల తరబడి తవ్వకాలు జరుగుతుండంతో పకృతి సంపదకు చెందిన విలు వైన గుట్టలు మాయం అవుతున్నాయి.
జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలు యథేచ్చగా కొన సాగుతున్నాయి. జిల్లాలోని రుద్రూర్‌, బోధన్‌, ఎడపల్లి, కోటగిరి, రెంజల్‌, నిజామాబాద్‌ రూరల్‌, మోస్రా, మోపాల్‌, డిచిపల్లి, నందిపేట, మాక్లూర్‌, నవీపేట, జక్రాన్‌పల్లి, ఆర్మూర్‌, భీమ్‌గల్‌, వేల్పూర్‌, మోర్తాడ్‌ మండలాల పరిధిలో ఎక్కువగా జరుగుతోంది. జిల్లాలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే మట్టి, మొరం తవ్వకాలకు అనుమతి ఇచ్చారు. ఆ ప్రాంతాలలో తవ్వకాలు జ రుగుతున్నా ఇతర ప్రాంతాలలో పెద్ద ఎత్తున చేస్తు న్నారు. జిల్లాలోని రుద్రూర్‌, కోటగిరి మండలాల పరిధి లో ఎలాంటి అనుమతులు లేకుండానే ఎక్కువగా తవ్వకాలు చేస్తున్నారు. అధికార పార్టీ నేతల అండదండలతో తవ్వకాలు కొనసాగిస్తున్నా రు. అభివృద్ధి పనుల మాటున అ మ్మకాలు చేస్తున్నారు. ట్రాక్ట ర్లు, టిప్పర్ల ద్వారా తర లిస్తున్నారు. మూడు రోజుల క్రితం ఒక టిప్పరు మట్టి తరలిస్తుండగా బోల్లా పడిన చర్యలు లేవు. నిజా మాబాద్‌ నగరం పరిధిలోని నాగారం, అర్సపల్లి, సారంగపూర్‌, ధర్మపురిహిల్స్‌ ప్రాంతాల్లో మట్టి, మొరం తవ్వకాల వల్ల గుట్టలు మాయం అ య్యాయి. ప్రతిరోజూ ప్రాంతంలో తవ్వకాలు జరు గుతున్నాయి. జిల్లా జైలు సమీపంలోను ఎక్కువగా మ ట్టి తవ్వకాలు చేస్తున్నారు. ఆర్మూర్‌ ప్రాంతంలో ప్రజా ప్రతినిధుల అండదండలతో గుట్టలను అభివృద్ధి పేరిట తొలిచేశారు. మట్టి కింగ్‌గా పిలిచే వ్యక్తి నిత్యం మట్టి, మొరం టిప్పర్ల ద్వారా తరలిస్తూ అమ్మకాలు చేస్తు న్నారు.  నందిపేట మండలం నందిగుట్ట వద్ద తవ్వ కా లతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోయాయి. ఎడపల్లి, జక్రాన్‌ పల్లి, డిచిపల్లి, మోపాల్‌ మండలాలల్లో ఎక్కువగా తవ్వకాలు కొనసాగుతున్నాయి. మట్టి, మొరం తవ్వ కాలతో గుట్టలు ఆనవాళ్లు కోల్పోతున్నాయి. జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలకు అనుమతులు ఇచ్చిన చోట నిబంధనల మేరకు తవ్వుతున్న ఇతర గ్రామాల్లో మాత్రం  పట్టించుకోవడం లేదు. ఏళ్ల తరబడి తవ్వ కాలు చేయడం వల్ల పకృతి సంపదకు కూడా దెబ్బ తింటుంది. జిల్లాలో  ప్రతి అభివృద్ధి పనికి మట్టి, మొ రం అవసరం ఉండడంతో డిమాండ్‌ పెరిగింది. స్థానిక ప్రజాప్రతినిధుల తోడ్పాటుతో ఎలాంటి అనుమతులు లేకుండా ఈ మట్టి, మొరం తవ్వకాలను  ఎక్కువగా చేస్తున్నారు. ఇళ్ల నిర్మాణాలకు, రోడ్లు, రియల్‌ ఎస్టేట్‌ వెంచర్లు, ఇటుక బట్టీలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు.
దాడి చేసి పట్టుకుంటున్న పోలీసులు
జిల్లాలో అక్రమంగా తవ్వకాలు చేస్తూ తరలిస్తున్న మొరం, మట్టిని పోలీసులే ఎక్కువగా పట్టుకుంటున్నారు. రెవెన్యూ, అటవీ, గనులు, భూగర్భ శాఖ అధికారులు ఈ తవ్వకాలపై నజర్‌ తక్కువగా పెట్టడం వల్ల మొరం తవ్వకాలు జోరుగా కొనసాగుతు న్నాయి. మొరం మట్టి తవ్వకాలు చేసే వారికి అధికార పార్టీకి చెందిన స్థానిక నేతల అందడందలు ఉండడంతో కొంత మంది అధికారులు దాడులు చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారు. జిల్లాలో జరుగుతున్న ఈ తవ్వకాలపై నిఘా వర్గాల అధికారులు కూడా తమ నివేదికనను పంపించారు. ఈ తవ్వకాలలో ఎవరెవరి పాత్ర ఉందో నివేదికలో పొందు పరిచినట్లు తెలుస్తోంది. జిల్లాలో మట్టి, మొరం తవ్వకాలు అభివృద్ధి పనుల కోసమే అనుమతులు ఇచ్చామని రెవెన్యూ, గనులు, భూగర్భ శాఖ అధికారులు తెలిపారు. స్థానిక అవసరాల కోసం మండల స్థాయిలో ఈ అనుమతులు ఇస్తున్నామని వారు తెలిపారు. ఇదిలా ఉండగా మొరం మట్టిని అక్రమంగా తరలిస్తున్నట్లు వస్తున్న సమాచారం మేరకు పోలీసులు మాటు వేసి దాడి చేసి మొరం తలిస్తున్న టిప్పర్లను పట్టుకుంటున్నారు. వాటిని రెవెన్యూ అధికారులకు అప్పగించడంతోపాటు కేసులు నమోదు చేస్తున్నారు. అయినా సంబంధిత అధికారుల్లో మాత్రం చలనం రావడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు.

Updated Date - 2022-01-18T05:40:24+05:30 IST