సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

ABN , First Publish Date - 2021-01-26T05:59:35+05:30 IST

: పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ జీవీ ఆంజనేయులు అన్నారు.

సుప్రీం తీర్పు చరిత్రాత్మకం

 జీవీ ఆంజనేయులు


గుంటూరు, జనవరి 25(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికలపై సుప్రీంకోర్టు సోమవారం ఇచ్చిన తీర్పు చరిత్రాత్మకమని నరసరావుపేట పార్లమెంటరీ టీడీపీ ఇన్‌ఛార్జ్‌ జీవీ ఆంజనేయులు అన్నారు. సోమవారం ఆయన ఆన్‌లైన్‌లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. రాష్ట్రంలో ఏ వ్యవస్థను సజావుగా పనిచేయనీయకుండా అడుగడుగునా ఆటంకాలు సృష్టిస్తున్నారన్నారు. శాసనమండలి రద్దుకు బిల్లు, నిజాయితీగా పనిచేసే అధికారులకు వేధింపులు, న్యాయవ్యవస్థపై దాడి, న్యాయమూర్తులపై దుర్భాషలు, ఎన్నికల సంఘంపై దాడి, ఈసీని కులంపేరుతో దూషించడం, జీవోనెం.2430 ద్వారా మీడియాపై ఆంక్షలు విధించడం, ప్రభుత్వ కార్యాలయాలకు వైసీపీ రంగులు, కోర్టు తీర్పులు అమలు చేయడం వంటివి రాజ్యాంగ వ్యవస్థలను విచ్ఛిన్నం చేయటంలో భాగమేనని ఆరోపించారు. ప్రతి సందర్భంలోనూ కోర్టులే జోక్యం చేసుకొని న్యాయం చేయడం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టటం హర్షనీయమన్నారు. నిష్పక్షపాతంగా, సజావుగా ఎన్నికలు స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించాలని జీవీ ఆంజనేయులు కోరారు.  

Updated Date - 2021-01-26T05:59:35+05:30 IST