Abn logo
Oct 17 2021 @ 14:46PM

జగన్మోహన్‌రెడ్డి అధికారం, రాష్ట్రానికి మిగిల్చింది అంథకారం: జీ.వీ.ఆంజనేయులు

అమరావతి: వైసీపీ ప్రభుత్వంపై నరసరావుపేట పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే జీవీ ఆంజనేయులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ‘జగన్మోహన్ రెడ్డి అధికారం.. రాష్ట్రానికి మిగిల్చింది అంథకారం’ అంటూ విమర్శించారు. ప్రభుత్వం ముందు చూపంతా అవినీతి, దోపిడీపైనే ఉందని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు ఏసీల్లో జీవిస్తుంటే, సామాన్యులకు ఫ్యాన్ గాలి కూడా లేదన్నారు. సాయంత్రం 6 దాటాక ఫ్యాన్లు, ఏసీలు ఆపేయాలని ప్రజలకు సలహాలిస్తున్న ప్రభుత్వ పెద్దలు, ఆ పనిచేస్తున్నారా? అని ప్రశ్నించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటేసినందుకు, ప్రజల ఇళ్లల్లో ఎక్కడా ఫ్యాన్ తిరగడంలేదన్నారు. రాజశేఖర్ రెడ్డి హాయాంలోని డిస్కంల బకాయిలను కూడా జగన్ రెడ్డి ఇప్పుడు వసూలు చేస్తున్నారన్నారు. ఎస్సీ, ఎస్టీలకు 2 వందల యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అని చెప్పి, ఇప్పుడు అకారణంగా కాలనీల్లో కరెంట్ కట్ చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీలకు ఉచిత విద్యుత్ ఇవ్వకుంటే, వారే ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని ఆంజనేయులు అన్నారు.

క్రైమ్ మరిన్ని...