Abn logo
Sep 20 2020 @ 21:27PM

తెలుగులో ఆ హీరో అంటే చాలా ఇష్టం: జి.వి. ప్రకాష్‌

Kaakateeya

సంగీత దర్శకుడిగా, హీరోగా గుర్తింపు తెచ్చుకున్న మల్టీ టాలెంటెడ్‌ నటుడు జీవీ ప్రకాష్‌ కుమార్‌. ఆయన సంగీతం అందించిన చిత్రం 'సురారై పొట్రు'.  ఈ చిత్రం అక్టోబర్‌ 30న ఓటీటీలో విడుదల కాబోతోన్న విషయం తెలిసిందే. సూర్య హీరోగా నటించిన ఈ చిత్రంలో అపర్ణ బాలమురళీ హీరోయిన్‌గా నటించింది. సుధా కొంగర దర్శకత్వం వహించిన ఈ చిత్రం తెలుగులో 'ఆకాశం నీ హద్దురా' అనే టైటిల్‌తో విడుదల కానుంది. తాజాగా సంగీత దర్శకుడు జీవీ ప్రకాష్‌.. ట్విట్టర్‌లో లైవ్ నిర్వహించారు. నెటిజన్లు తనని అడిగిన ప్రశ్నలకు ఆయన లైవ్‌లో వీడియో రూపంలో సమాధానమిచ్చారు. కాగా, ఒక నెటిజన్‌ తెలుగులో మీకు నచ్చిన హీరో ఎవరు? అని ఆయనని ప్రశ్నించారు. 


దీనికి సమాధానమిస్తూ.. ''తెలుగులో నేను ఎంతో ఇష్టపడే నటుడు పవన్‌ కల్యాణ్ గారు. ఆయన కరిష్మా అంటే చాలా ఇష్టం. కరుణాకరణ్‌ సార్‌ ద్వారా ఆయన నాకు తెలుసు. ఆయన నా పాటలు విన్నారు. నా ఉల్లాసంగా ఉత్సాహంగా చిత్ర పాటలంటే ఆయనకు చాలా ఇష్టం. అప్పట్లో ఆయన ఇద్దరు ముగ్గురు నిర్మాతలకు కూడా నన్ను రికమండ్‌ చేశారు. సో.. ఐ వెరీ లైక్‌ పవన్‌ కల్యాణ్‌ సార్‌.." అని జీవి ప్రకాష్‌ తెలిపారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అవుతుంది. 


Advertisement
Advertisement
Advertisement