Abn logo
Sep 25 2020 @ 03:17AM

‘ ‘మిర్చి‘టాస్క్‌ ఫోర్స్‌ చైర్మన్‌గా జీవీఎల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24(ఆంధ్రజ్యోతి):  కేంద్ర సుగంధ ద్రవ్యాల(స్పైసెస్‌ బోర్డు) మండలి ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన ప్రత్యేక ‘మిర్చి‘ టాస్క్‌ఫోర్స్‌కు బీజెపీ ఎంపీ, బోర్డు సభ్యుడు జీవీఎల్‌ నరసింహారావు చైర్మన్‌గా నియమితులయ్యారు. దేశంలో మిర్చి పంట అభివృద్ధి, వాటి ఉత్పత్తుల ఎగుమతులను ప్రోత్సహించడం ఈ  టాస్క్‌ఫోర్స్‌ విధి.

కాగా, జీవీఎల్‌తోతోపాటు మరో 15మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో అవసరాన్ని బట్టి అదనంగా మరికొందరు సభ్యులను నియమించుకునే అధికారం చైౖర్మన్‌ జీవీఎల్‌కు ఇచ్చారు. 


Advertisement
Advertisement
Advertisement