తిరుపతి: ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై జీవీఎల్ సమీక్ష

ABN , First Publish Date - 2020-11-26T21:11:29+05:30 IST

ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు సమీక్ష నిర్వహించారు.

తిరుపతి: ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై జీవీఎల్ సమీక్ష

తిరుపతి: ఎయిర్‌పోర్టులో మౌలిక సదుపాయాలపై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు గురువారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిర్‌ కార్గో టెర్మినల్, అంతర్జాతీయ ప్రయాణికుల సేవలపై ఆరా తీసినట్లు చెప్పారు. ఎయిర్ కార్గో సేవలు, అంతర్జాతీయ ప్రయాణీకుల సేవలకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఎయిర్ సంస్థలకు ఆదాయం పెరిగితే.. ప్రయాణీకుల ఛార్జీలు తగ్గుతాయన్నారు. విమానాశ్రయానికి ఇమ్మిగ్రేషన్ చెక్‌పోస్ట్ క్లియరెన్స్ ఇవ్వాలని, వందే భారత్ మిషన్‌లో గల్ఫ్ నుంచి రాయలసీమకు విమానాలు ప్రారంభించాలన్నారు. కువైట్, సౌదీ అరేబియా, యూఏఈ ఎంబాసిడర్‌లతో చర్చించానన్నారు. దీనిపై ముగ్గురు ఉన్నతాధికారులు చర్యలు తీసుకుంటామన్నారని జీవీఎల్ తెలిపారు.

Updated Date - 2020-11-26T21:11:29+05:30 IST