షీలానగర్‌లో పౌర సమస్యలపై కమిషనర్‌ ఆరా

ABN , First Publish Date - 2020-12-03T05:54:23+05:30 IST

జీవీఎంసీ 69వ వార్డు షీలానగర్‌లో బుధవారం జీవీఎంసీ కమిషనర్‌ సృజన పర్యటించారు. కాలనీలో నిరుపయోగంగా వున్న పార్కులను, కమ్యూనిటీ హాల్‌ను ఆమె పరిశీలించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

షీలానగర్‌లో పౌర సమస్యలపై కమిషనర్‌ ఆరా
షీలానగర్‌లో కాలువలు పరిశీలిస్తున్న జీవీఎంసీ కమిషనర్‌ సృజన

అక్కిరెడ్డిపాలెం: జీవీఎంసీ 69వ వార్డు షీలానగర్‌లో బుధవారం జీవీఎంసీ కమిషనర్‌ సృజన పర్యటించారు. కాలనీలో నిరుపయోగంగా వున్న పార్కులను, కమ్యూనిటీ హాల్‌ను  ఆమె పరిశీలించి స్థానికుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాలనీలో వున్న రెండు పార్కులు శిఽథిలావస్థకు చేరుకోవడం వలన నిరుపయోగంగా వున్నాయని కాలనీ అధ్యక్షుడు జి.సుబ్బారావు, కార్యదర్శి వై.సత్యవతి కమిషనర్‌కు విన్నవించారు. వీటితోపాటు రహదారులు, కాలువలు శిథిలావస్థకు చేరుకోవడం వలన వర్షాకాలంలో పలు ఇబ్బందులు ఎదురవుతున్నాయని వారు తెలిపారు. డస్ట్‌బిన్‌లు పలు ప్రాంతాలలో తొలగించడం వలన పారిశుధ్య సమస్య ఏర్పడటంతోపాటు పందుల సంచారం అధికమైందని వారు ఆవేదన వ్యక్తపరిచారు. కాలనీలో ఆరోగ్యకేంద్రం, రైతు బజారు ఏర్పాటు చేయాలని కాలనీ ప్రజలు కోరగా, ఆమె సుముఖంగా స్పందించారు. ఈ పర్యటనలో గాజువాక జోనల్‌ కమిషనర్‌ బి.శ్రీధర్‌, ఈఈ వేణుగోపాల్‌, ఏఎంహెచ్‌వో లక్ష్మితులసి, వైసీపీ నాయకుడు బోగాది సన్యాసిరావు పాల్గొన్నారు.


Updated Date - 2020-12-03T05:54:23+05:30 IST