నేటి నుంచి జిమ్‌ల ఓపెన్‌

ABN , First Publish Date - 2020-08-05T11:25:05+05:30 IST

జిల్లాలోని జిమ్‌లు, యోగా సెంటర్లు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి.

నేటి నుంచి జిమ్‌ల ఓపెన్‌

అన్‌లాక్‌ సడలింపుతో కాస్త ఊరట


నెల్లూరు (క్రీడలు) ఆగస్టు 4 :  జిల్లాలోని జిమ్‌లు, యోగా సెంటర్లు బుధవారం నుంచి తెరుచుకోనున్నాయి. అన్‌లాక్‌లో సడలింపులు ఇవ్వడంతో ఈ వెసులుబాటు కలిగింది. జిల్లాలో చిన్నా, పెద్దా అన్నీ కలిపి సుమారు 250కు పైగా జిమ్‌లు, యోగా సెంటర్‌లు ఉన్నాయి. ఇవన్నీ నాలుగు నెలలుగా మూతపడ్డాయి. రిగన్నైజ్డ్‌ ఫిట్‌నెస్‌ సెంటర్‌లలో ఒక్కొక్క దానికి దాదాపు రూ.25లక్షల నుంచి రూ.50లక్షల వరకు పె ట్టుబడులు పెట్టారు నిర్వాహకులు. అందులో బ్యాంక్‌లోన్‌లు, బయట అప్పులు చేసి మరీ పెట్టిన వారు కూడా ఉన్నారు. దాదాపు నాలుగు నెలలుగా ఇవి మూతపడడంతో వాటి నిర్వహణ భారంగా మారింది. భవన అద్దెలు, శిక్షకులు, సిబ్బంది జీతాలు, కరెంట్‌ బిల్లులు చెల్లించాల్సి రావడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ తరుణంలో కేంద్ర ప్రభుత్వం వీరికి కొంత ఊరట కలిగించేలా జిమ్‌లకు అనుమతులివ్వడంతో ఊపిరి పీల్చుకున్నారు.


నిబంధనల మేరకే నిర్వహణ..జిమ్‌ వంశీ, జిమ్‌ నిర్వాహకుడు

జిమ్‌లకు అనుమతులివ్వడంతో తెరిచేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాం.ప్రభుత్వ నిబంధనల మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ నిర్వహిస్తాం. 


కాస్తంత ఊరట..సురేష్‌నాయుడు, జిమ్‌ నిర్వాహకుడు

వందరోజులకు పైగా జిమ్‌లు మూతపడడంతో ఆర్ధికంగా చాలా నష్టపోయాం.  ప్రస్తుతం అనుమతులిస్తున్నా గతంలో మాదిరిగా జిమ్‌లు నడిపే పరిస్థితులు లేవు. ప్రభుత్వ ప్రకటన కాస్తంత ఊరట నిచ్చింది.

Updated Date - 2020-08-05T11:25:05+05:30 IST