ఫేస్‌బుక్‌లో ఫేక్ ప్రొఫైల్‌... వంద‌మంది యువ‌తుల‌ను వేధించిన‌ జిమ్ ట్రైన‌ర్ అరెస్ట్‌

ABN , First Publish Date - 2021-06-20T17:01:23+05:30 IST

ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి...

ఫేస్‌బుక్‌లో ఫేక్  ప్రొఫైల్‌... వంద‌మంది యువ‌తుల‌ను వేధించిన‌ జిమ్ ట్రైన‌ర్ అరెస్ట్‌

న్యూఢిల్లీ: ఫేస్‌బుక్‌లో నకిలీ ప్రొఫైల్‌ సృష్టించి, యువ‌తుల‌కు అశ్లీల సందేశాలు, వీడియోలు పంపిన జిమ్ ట్రైనర్‌ను ఢిల్లీ సౌత్ వెస్ట్ జిల్లా సైబర్ సెల్ అరెస్ట్ చేసింది. నిందితుడు తన ఫేక్‌ ప్రొఫైల్ నుంచి వంద మందికిపైగా యువ‌తుల‌కు అశ్లీల సందేశాలు, వీడియోలను పంపాడు. నిందితుడిని పోలీసులు విచారిస్తున్నారు. నిందితుడిని దశ్రాత్‌పురి నివాసి వికాస్ కుమార్‌గా గుర్తించినట్లు జిల్లా అదనపు డిప్యూటీ కమిషనర్ అమిత్ గోయల్ తెలిపారు. సాగర్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో త‌న‌కు శీత‌ల్ ఠాకూర్ అనేవ్య‌క్తి ఫేస్‌బుక్  ప్రొఫైల్ నుంచి అశ్లీల సందేశాలు వీడియోలు వ‌స్తున్నాయ‌ని ఒక మహిళ ఫిర్యాదు చేసింది. వెంట‌నే పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అనంత‌రం వికాస్‌ను లొకేషన్ ద్వారా క‌నుగొని అరెస్టు చేశారు. తాను మూడు ఫేక్‌ఫేస్‌బుక్ ప్రొఫైల్స్‌ సృష్టించానని విచారణ సమయంలో పోలీసుల‌కు వికాస్ తెలిపాడు. కాగా సుమారు ఆరు నెలలుగా వికాస్ ఇటువంటి ప‌నులు చేస్తున్నాడ‌ని పోలీసుల విచార‌ణ‌లో తేలింది.

Updated Date - 2021-06-20T17:01:23+05:30 IST