మరింత మందికి హెచ్‌1బీ వీసాలు

ABN , First Publish Date - 2021-07-31T11:44:52+05:30 IST

అమెరికా నుంచి హెచ్‌1బీ వీసాలు పొందలేకపోయిన భారత టెకీలకు శుభవార్త. రెండో లాటరీ ద్వారా మరింత మందికి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేయనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. మొదటి లాటరీలో తగినన్ని వీసాలు మంజూరు చేయలేకపోయామని, అందుకే రెండో లాటరీ చేపడుతున్నామని పేర్కొంది.

మరింత మందికి హెచ్‌1బీ వీసాలు

వాషింగ్టన్‌, జూలై 30: అమెరికా నుంచి హెచ్‌1బీ వీసాలు పొందలేకపోయిన భారత టెకీలకు శుభవార్త. రెండో లాటరీ ద్వారా మరింత మందికి హెచ్‌1బీ వీసాలు మంజూరు చేయనున్నట్లు అమెరికా ఇమ్మిగ్రేషన్‌ ఏజెన్సీ యూఎస్‌సీఐఎస్‌ ప్రకటించింది. మొదటి లాటరీలో తగినన్ని వీసాలు మంజూరు చేయలేకపోయామని, అందుకే రెండో లాటరీ చేపడుతున్నామని పేర్కొంది. ఈ మేరకు గతంలోనే సమర్పించిన ఎలకా్ట్రనిక్‌ రిజిస్ట్రేషన్ల ఆధారంగా ఈ నెల 28న కొందరిని ఎంపిక చేసినట్లు వెల్లడించింది. 


పిటిషన్ల ఫైలింగ్‌ ఆగస్టు 2న ప్రారంభమై నవంబరు 3న ముగుస్తుందని తెలిపింది. ఎంపికైనవారు హెచ్‌1బీ క్యాప్‌ దరఖాస్తు పూర్తి చేయాలని సూచించింది. వచ్చే ఆర్థిక సంవత్సరం (2021 అక్టోబరు నుంచి 2022 సెప్టెంబరు)లో హెచ్‌1బీ వీసాల కోసం ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 30 వరకు దరఖాస్తు చేసుకున్న వారి నుంచి మొదటి లాటరీలో ఎంపిక చేసింది. అమెరికా ఐటీ కంపెనీలకు వృత్తి నిపుణుల కొరత ఉండడం, దీంతో వేల సంఖ్యలో విదేశీ వృత్తి నిపుణులను నియమించుకుంటుండడం తెలిసిందే. వీరికి వీసాల మంజూరు విషయంలో జో బైడెన్‌ ప్రభుత్వం సంప్రదాయ లాటరీ విధానాన్నే అనుసరిస్తోంది. తాజాగా రెండో లాటరీ ద్వారా కూడా హెచ్‌1బీ వీసాలు మంజూరు చేస్తుండడంతో భారత్‌కు చెందిన మరింత మందికి అవకాశం లభించనుంది. సాధారణంగా ప్రతి ఆర్థిక సంవత్సరంలో 65 వేల హెచ్‌1బీ వీసాలను అమెరికా మంజూరు చేస్తుంది. వీరు మాత్రమే హెచ్‌1బీ క్యాప్‌ దరఖాస్తు పూర్తిచేయాల్సి ఉంటుంది. మరో 20 వేల హెచ్‌1బీ వీసాలను అత్యున్నత విద్యార్హతలు, నైపుణ్యం గలవారికి మాస్టర్‌ క్యాప్‌ కింద మంజూరు చేస్తుంది. 


Updated Date - 2021-07-31T11:44:52+05:30 IST