మంత్రి మేకపాటి ట్విటర్‌ హ్యాక్‌

ABN , First Publish Date - 2021-04-11T09:30:58+05:30 IST

మంత్రి మేకపాటి ట్విటర్‌ హ్యాక్‌

మంత్రి మేకపాటి ట్విటర్‌ హ్యాక్‌

అమరావతి, ఏప్రిల్‌ 10(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి ట్విటర్‌ ఖాతా హ్యాక్‌ అయింది. ఈ విషయాన్ని మంత్రి ట్విటర్‌ ద్వారా శనివారం వెల్లడించారు. ‘‘కొన్ని అసాంఘిక శక్తులు నా ట్విటర్‌ ఖాతాను హ్యాక్‌ చేశాయి. సంబంధం లేని, రెచ్చగొట్టే పోస్టింగ్‌లు పెడుతున్నాయి. వాటిని పట్టించుకోవద్దు. దీనిపై ఏపీ పోలీస్‌ 100కు ఫిర్యాదు చేశాను’’ అని మంత్రి తెలిపారు. 

Updated Date - 2021-04-11T09:30:58+05:30 IST