దక్షిణాదిలో హయర్‌ యూనిట్‌!

ABN , First Publish Date - 2020-02-23T06:37:10+05:30 IST

ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, ఎల్‌ఈడీ టీవీలు తదితర గృహోపకరణాల విభాగాల్లో హయర్‌ అప్లయన్స్‌ ఇండియా 83 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది.

దక్షిణాదిలో హయర్‌ యూనిట్‌!

విపణిలోకి 83 కొత్త గృహోపకరణాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): ఎయిర్‌ కండీషనర్లు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్‌ మిషన్లు, ఎల్‌ఈడీ టీవీలు తదితర గృహోపకరణాల విభాగాల్లో హయర్‌ అప్లయన్స్‌ ఇండియా 83 కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేసింది. హైదరాబాద్‌ ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో (హెచ్‌ఐసీసీ) ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌ (ఐఓటీ) వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో పనిచేసే గృహోపకరణాలను కంపెనీ ప్రదర్శించింది. స్మార్ట్‌ హోమ్‌ సొల్యూషన్లను మార్కెట్లోకి ప్రవేశపెడుతున్న నేపథ్యంలో భారత్‌లో అన్ని గృహోపకరణాల విభాగాల్లో కంపెనీ వృద్ధి కొనసాగగలదని, ఖాతాదారుల సంఖ్య పెరగగలదని కంపెనీ భావిస్తోంది. గ్రేటర్‌ నోయిడాలో కొత్త ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ఈ ఏడాది అక్టోబరు  నాటికి ఇది ఉత్పత్తి ప్రారంభిస్తుంది. కంపెనీ గృహోపకరణాలకు ఇదే స్థాయి గిరాకీ కొనసాగితే.. మరో ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి  తెలంగాణతో సహా దక్షిణాది రాష్ట్రాలను పరిశీలించగలమని హయర్‌ అప్లియన్స్‌ ఇండియా ప్రెసిడెంట్‌ ఎరిక్‌ బ్రగంజా తెలిపారు. 


కంపెనీ ప్రదర్శిస్తున్న గృహోపకరణాల్లో వై-ఫై ఆధారిత డ్యుయల్‌-డ్రమ్‌ సూపర్‌ సైలెంట్‌ వాషింగ్‌ మిషన్లు, గూగుల్‌ సర్టిఫైడ్‌ బెజిల్‌-లెస్‌ స్మార్ట్‌ ఎల్‌ఈడీ టీవీలు, కనెక్టెడ్‌ రిఫిజిరేటర్లు, క్లీన్‌ కూల్‌ శ్రేణి ఏసీలు మొదలైనవి ఉన్నాయని హయర్‌ ఇండియా సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ (మార్కెటింగ్‌) ఎన్‌ఎ్‌స సతీష్‌ చెప్పారు. దేశీయ గృహోపకరణాల పరిశ్రమ ఐఓటీ వంటి కొత్త టెక్నాలజీల్లోకి అడుగు పెడుతోంది.  


ఖాతాదారులు కనెక్టెడ్‌, కొత్త అనుభవాన్ని ఇచ్చే గృహోపకరణాలను కోరుకుంటున్నారని ఎరిక్‌ చెప్పా రు.  2,000 మంది డైరెక్ట్‌ డీలర్లతో సహా హయర్‌కు భారత్‌లో 20,000 మంది డీలర్లు ఉన్నారని వివరించారు. లార్జ్‌ ఫార్మాట్‌ స్టోర్లు, మల్టీ బ్రాండ్‌ అవుట్‌లెట్లు తదితరాల ద్వారా రిటైల్‌ నెట్‌వర్క్‌, ఖాతాదారుల సంఖ్యను పెంచుకోనున్నామని తెలిపారు.   


Updated Date - 2020-02-23T06:37:10+05:30 IST