వడగండ్ల వాన - నేలరాలిన వరి ధాన్యం

ABN , First Publish Date - 2021-05-11T05:55:37+05:30 IST

మండలంలో ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వ ర్షం సోమవారం సాయంత్రం బీభత్సాన్ని సృష్టించింది.

వడగండ్ల వాన - నేలరాలిన వరి ధాన్యం
నేలరాలిన వరి పంటను చూపుతున్న రైతు

బొమ్మనహాళ్‌, మే 10 : మండలంలో ఈదురుగాలులు, వడగండ్లతో కురిసిన వ ర్షం సోమవారం సాయంత్రం బీభత్సాన్ని సృష్టించింది. వందల ఎకరాల్లో వరి పంట నేలపాలైంది. ఉద్దేహాళ్‌, రంగాపురం, కొళగానహళ్లి, లింగదహాళ్‌ గ్రామాల్లో ఓ మోస్త రు వర్షం కురిసింది. కొళగానహళ్లి, లింగదహాళ్‌ గ్రామాల పరిధిలో వడగండ్ల వర్షం రైతులకు కడగండ్లు మిగిల్చింది. వడగండ్లు పడటంతో పంట నేలకొరిగి గింజలు నే లరాలాయి. దీంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. కొళగానహళ్లికి చెందిన తిమ్మరా జు, జయరాములు, మావల్లి, లక్ష్మీదేవి, వైకుంఠస్వామి, వెంకటేశులు తదితర రైతుల  పంట పొలాల్లో వడగండ్లు పడటంతో వరి ధాన్యం నేలరాలింది. అకాల వర్షం నిండా ముంచిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వడగండ్లకు పెనుగాలులు తోడవడంతో రైతులకు అపారనష్టమే మిగిల్చింది. ఎకరాకు రూ.20 వేలు నుంచి రూ.30 వే ల వరకు పెట్టుబడి పెట్టి పండించిన పంట వడగండ్ల వానతో రూ.లక్షల్లో నష్టం వా టిల్లిందని బాధిత రైతులు వాపోయారు. ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకుంటున్నారు. 


విడపనకల్లులో భారీ వర్షం

విడపనకల్లు : మండలంలోని పలు గ్రామాల్లో సోమవారం సాయంత్రం భారీ వ ర్షం కురిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి గంటపాటు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. మండల కేంద్రంలో భారీగా ఉరుము మెరుపులు రావటం తో ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. వీధుల్లోను, పంట పొలాల్లోను చిన్న పా టి వంకలు పొర్లాయి. వర్షం రావడంతో వాతావరణం కొంత మేర చల్లబడింది. రై తులు, ప్రజలు హర్షం వ్యక్తంచేశారు ఎండ వేడిమితో ఉక్కపోతకు అల్లాడి పోతున్న ప్రజలు వర్షం రాకతో కొంత ఉపశమనం పొందారు.


Updated Date - 2021-05-11T05:55:37+05:30 IST