మహిళల పై పెదవి మీద వెంట్రుకలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

ABN , First Publish Date - 2021-11-09T18:07:01+05:30 IST

గడ్డం మీద అరుదుగా పెరిగే ఒకే ఒక వెంట్రుక గురించి మహిళలకు బెంగ అవసరం లేదు. అయితే ఒకటి కంటే ఎక్కువగా, తరచుగా పెరుగుతూ ఉంటే ఆ సమస్యను ‘హిర్సుటిజం’గా భావించాలి. వైద్యుల సహాయంతో కారణాలను అన్వేషించి, చికిత్స తీసుకోవాలి.

మహిళల పై పెదవి మీద వెంట్రుకలు పెరగడానికి కారణం ఏంటో తెలుసా..?

ఆంధ్రజ్యోతి(09-11-2021)

గడ్డం మీద అరుదుగా పెరిగే  ఒకే ఒక వెంట్రుక గురించి మహిళలకు బెంగ అవసరం లేదు. అయితే ఒకటి కంటే ఎక్కువగా, తరచుగా పెరుగుతూ ఉంటే ఆ సమస్యను ‘హిర్సుటిజం’గా భావించాలి. వైద్యుల సహాయంతో కారణాలను అన్వేషించి, చికిత్స తీసుకోవాలి.

జన్యువులు: హిర్సుటిజం వంశపారంపర్యం. అమ్మమ్మ, అమ్మ, మేనత్త, పిన్ని, అక్క... ఇలా రక్తసంబంధీకులు ఇదే సమస్యతో  బాధపడి ఉంటే, మీకూ ఈ సమస్య తప్పదని గుర్తుంచుకోవాలి. 

హార్మోన్ల హెచ్చుతగ్గులు: ఆండ్రోజెన్స్‌ అనే పురుష హార్మోన్‌ పరిమాణం పెరిగినా ఈ సమస్య తలెత్తుతుంది. సహజసిద్ధంగా మహిళల శరీరాల్లో తక్కువ పరిమాణంలో ఉండే ఈ మేల్‌ హార్మోన్‌ కొన్ని సందర్భాల్లో పెరిగిపోతుంది. ఫలితంగా గడ్డం మీద  వెంట్రుకలు పెరగడం, గొంతు మారడం లాంటి లక్షణాలు మొదలవుతాయి.

మెనోపాజ్‌: ఈ దశలో మహిళల శరీరాల్లో ఈస్ట్రోజన్‌ స్రావం తగ్గుతుంది. గడ్డం, పై పెదవి మీద వెంట్రుకలు పెరగడానికి మెనోపాజ్‌ మరో కారణం.

పాలీసిస్టిక్‌ ఓవరీస్‌: నెలసరిలో అవకతవకలు, బరువు పెరగడం, ఫెర్టిలిటీ సమస్యలు ఈ సిండ్రోమ్‌ ప్రధాన లక్షణాలు. గడ్డం మీద వెంట్రుకలు పెరగడం ఈ సమస్యలో కనిపించే ప్రధాన లక్షణం. 

ఇలా తొలగించుకోవచ్చు: వైద్యులు సూచించిన చికిత్సలను అనుసరించడంతో పాటు జీవనశైలి మార్పులతో గడ్డం మీద పెరిగే వెంట్రుకలకు అడ్డుకట్ట వేయవచ్చు

Updated Date - 2021-11-09T18:07:01+05:30 IST