హజ్‌యాత్రకు దరఖాస్తుల స్వీకరణ షురూ

ABN , First Publish Date - 2021-11-04T13:15:11+05:30 IST

హజ్‌యాత్రకు దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలంగాణ మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు తెలిపారు.

హజ్‌యాత్రకు దరఖాస్తుల స్వీకరణ షురూ

హైదరాబాద్: ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా హజ్ యాత్రకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు తెలంగాణ మైనారిటీ డిపార్ట్ మెంట్ పేర్కొంది ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ షఫీయుల్లా ఒక ప్రకటన చేస్తూ నవంబరు 1వ తేదీ నుంచి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు 2022,సంవత్సరం, జనవరి, 31వ తేదీ వరకూ దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పని సరిగా ఆన్ లైన్ ద్వారానే చేయాలని అన్నారు. హజ్ కమిటీ వెబ్ సైట్ ద్వరా కానీ, హెచ్ సి ఓఐ మొబైల్ యాప్ ద్వారా కూడా దరఖాస్తుచేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. దరఖాస్తు చేసుకునే వారు తప్పని సరిగా నిబంధనలు పాటించాలని అన్నారు. 


హజ్ కమిటీ నిబంధనల మేరకు ప్రతి దరఖాస్తు దారు తమ పాస్ట్ పోర్ట్ ఫోటో, కేన్సిల్ చేసిన ఒక చెక్కు, పాస్ పోర్ట్ కాపీ, అడ్రస్ ప్రూఫ్, అప్ లోడ్ చేయాల్సి వుంటుందని అధికారులు తెలిపారు. మొబైల్ యాప్ ద్వరా కానీ హజ్ కమిటీ వెబ్సైట్ లో కానీ దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచించారు. నాంపల్లిలోని హజ్ హౌస్ లో హజ్ యాత్రీకులకు ఉచిత సేవలు అందుబాటులో ఉన్నాయని, ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవాల అధికారులు సూచించారు. నాంపల్లిలోని హజ్ హౌస్ లో హజ్ యాత్రకు వెళ్లేవారికి అవసరమైన సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. హజ్ యాత్రీకులకు అవసరమైన సాయం చేసేందుకు నాంపల్లలోని హజ్ భవన్లో అవసరమైన ఏర్పాట్లు చేశారు. జంటనగరాల నుంచి హజ్ వెళ్లాలనుకునే  ప్రత్యేకంగా వాలంటరీలను నియమించి అవసరమైన వారికి సేవలను అందిస్తున్నారు. హజ్ యాత్ర కోసం ధరఖాస్తు చేసుకునే వారి నుంచి 300 రూపాయలను ప్రాసెసింగ్ ఫీజుగా వసూలు చేస్తున్నారు.

Updated Date - 2021-11-04T13:15:11+05:30 IST