Jun 3 2021 @ 09:48AM

త్వరలో 'శాకుంతలం' సెకండ్ షెడ్యూల్

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత ప్రధాన పాత్రధారిగా 'శాకుంతలం' అనే పౌరాణిక చిత్రం తెరకెక్కుతోంది. మే 10వ తేదీ వరకు షూటింగ్ జరిపిన చిత్ర బృంద  కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఆపేశారు. ప్రస్తుతం మధ్యాహ్నం 1 గం. వరకు వెసులుబాటు లభించడంతో త్వరలోనే సెకండ్ షెడ్యూల్ మొదలు పెడతామని దర్శకుడు గుణశేఖర్ తెలిపారు. అంతే కాదు షూటింగ్ ఇంత త్వరగా మొదలుపెట్టడానికి ముఖ్య కావడానికి కారణం సమంత - ప్రొడ్యూసర్ నీలిమ అంటున్నారు. దాదాపు ఐదేళ్ల తర్వాత గుణశేఖర్ నుండి 'శాకుంతలం' రాబోతోంది. పదేళ్ళ కెరీర్‌లో సమంత మొదటిసారి పౌరాణిక పాత్రలో నటిస్తోంది. ఇందులో దుష్యంతుడుగా మలయాళ నటుడు దేవ్ మోహన్ నటిస్తున్నారు. అలాగే సీనియర్ హీరో మంచు మోహన్ బాబు, అదితి బాలన్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. మెలోడిబ్రహ్మ మణిశర్మ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో రూపొందుతోంది.