Abn logo
Apr 5 2021 @ 17:32PM

డేట్ మార్చి హల్దీరామ్ ఫుడ్స్ అమ్మకాలు.. డిస్ట్రిబ్యూటర్ అరెస్ట్

హైదరబాద్: నగరంలో హల్దీ రామ్ పేరుతో కాలం చెల్లిన వాటిని... తేదీలు మార్చి విక్రయాలు జరుపుతున్న డిస్ట్రిబ్యూటర్ లక్ష్మీ నారాయణను లంగర్ హౌస్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. వెస్ట్ జోన్ డీసీపీ కార్యాలయానికి చెందిన జాయింట్ పోలీసు కమిషనర్ శ్రీనివాస్ కథనం ప్రకారం.. ఓ గోదాంలో నిల్వ ఉంచుతూ.. తిను బండారాల విక్రయాలు జరుపుతున్నారు. టిన్నర్‌తో డేట్ తొలగించి కొత్త డేట్ మార్చి.. లేటెస్ట్‌గా మార్కెట్‌లో అమ్ముతున్నారని ఆయన అన్నారు. లక్షా 50 వేల విలువ చేసే తిను బండారాలను స్వాధీనం చేసుకున్నారు. జైశ్రీరామ్ ఏజెన్సీ ద్వారా డేట్ అయిపోయిన వాటిని మార్కెట్‌లో అమ్ముతున్నట్టు తెలిపారు. కరోనా ఎఫెక్ట్‌తో నష్టం రావడంతో డబ్బులకు ఆశపడి లక్ష్మీ నారాయణ ఈ విధంగా విక్రయిస్తున్నాడని జాయింట్ కమిషనర్ తెలిపారు. హల్దీ రామ్ కంపెనీ‌కి కూడా ఈ విషయం తెలియదని, ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఏదైనా వస్తువు కొనేముందు పలుమార్లు చెక్ చేసి కొనడం మంచిదని శ్రీనివాస్ సూచించారు. 

Advertisement