Advertisement
Advertisement
Abn logo
Advertisement

పిల్లల్లేని మహిళలకు Italian docor గదిలో అర్దనగ్నంగా ఉండి చేస్తున్న చికిత్స ఏమంటే...షాకింగ్

బారి (ఇటలీ): పిల్లల్లేని మహిళలకు స్వస్థత చేకూర్చేందుకు ఓ కీచక ఇటాలియన్ వైద్యుడు హోటల్ గదిలో అర్దనగ్నంగా ఉండి చేస్తున్న చికిత్స  ఏమిటో కెమెరాకు చిక్కడంతో మహిళలు షాక్‌కు గురైన ఉదంతం ఇటలీ దేశంలో తాజాగా వెలుగుచూసింది. వంధ్యత్వానికి గురైన మహిళకు చికిత్స పేరిట ఓ కీచక డాక్టర్ లైంగిక చర్యను ఆఫర్ చేస్తూ కెమెరా కంటికి చిక్కాడు.డాక్టర్ మ్యాజిక్ ఫ్లూట్ అనే మారుపేరుతో ఉన్న ఇటాలియన్ గైనకాలజిస్ట్ జియోవన్నీ మినియెల్లో (60) లైంగికచర్యకు పాల్పడటం ద్వారా మహళలకు పిల్లలు పుట్టేలా చేస్తానని చెప్పాడు.  ఓ మహిళా రోగి హోటల్ గదిలో కీచక డాక్టరును అర్దనగ్నంగా పట్టుకోవడంతో అతను డాక్టరు ఉద్యోగానికి రాజీనామా చేయాల్సి వచ్చింది.

 ఓ మహిళా రోగి సెక్స్ క్యూర్ చేస్తున్న కీచక డాక్టర్ బాగోతాన్ని బట్టబయలు చేయడంతో ఇటలీ అధికారులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు. కీచక డాక్టర్ తన రొమ్ములను పట్టుకున్నాడని ఓ బాధిత మహిళ ఆరోపించింది.ఓ స్త్రీ తన సంతానోత్పత్తి సమస్యలకు చికిత్స కోసం మినియెల్లోని సంప్రదించింది. స్మెర్మ్ పరీక్ష తర్వాత ప్రతికూల ఫలితం వచ్చినప్పటికీ ఆమెకు హ్యుమన్ పాపిల్లోమావైరస్ ఉందని, లైంగికంగా సంక్రమించే డీఎన్ఏ వైరస్ కేన్సర్‌కు కారణమవుతుందని డాక్టర్ చెప్పాడు.ఆ తర్వాత తనతో శృంగారంలో పాల్గొనడం ద్వారా ఆమె జబ్బు నయం అవుతుందని చెప్పి డాక్టర్ మహిళకు అపాయింట్‌మెంట్ కూడా ఇచ్చాడు. ఆ మహిళ మినీలోపై అనుమానం వచ్చి న్యాయ సలహా కోరింది. 

ఆ తర్వాత ఆమె డాక్టర్‌ గదిలో తనతో వ్యవహరించిన తీరును రికార్డ్ చేసి బయటపెట్టింది.ఇలా ఓ సినీనటి కూడా డాక్టరు వద్ద ఇలాంటి చికిత్స చేయించుకుందని సమాచారం.సెక్స్ ద్వారా ఆమెకు వైరస్ నుంచి విముక్తి కల్పిస్తామని ఆమెకు హామీ ఇస్తూ డాక్టర్ మినియెల్లో తన బట్టలు తీసేస్తాడు.కీచక డాక్టర్ లైంగిక చర్య చేస్తున్నప్పుడు కండోమ్ కూడా ఉపయోగించడాన్ని కూడా నిరాకరించాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఇలా 15 మంది మహిళలను కీచక డాక్టర్ వంచించాడని దర్యాప్తులో తేలింది. 


Advertisement

ప్రత్యేకంమరిన్ని...

Advertisement