Advertisement
Advertisement
Abn logo
Advertisement

సగం ధాన్యం రైతుల వద్దే..

-  అమ్ముకునేందుకు అన్నదాతల పడిగాపులు

- క్వింటాలుకు 10 కిలోల తరుగు చేయాలని మిల్లర్ల డిమాండ్‌

-  చేతులెత్తేస్తున్న కొనుగోలు కేంద్రాలు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) 

వరిధాన్యం కొనుగోళ్లు నత్తనడకన సాగుతు న్నాయి. వరికోతలు పూర్తి కావస్తున్నా ఇప్పటికీ సగం వరిధాన్యం కొనుగోలు కేంద్రాల్లో, రైతుల కల్లా ల్లో, రోడ్లపైన ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, అక్క డక్కడ మొలకలు వస్తున్నాయి. 

జిల్లాలో నెల రోజులుగా లక్ష టన్నుల వరిధాన్యం మాత్రమే కొనుగోలు చేశారు. వరుసగా వస్తున్న అల్పపీడనాల వల్ల కురుస్తున్న వర్షాలకు వరి ధాన్యం తడుస్తోంది. మరికొన్ని చోట్ల సరిగా ఎండ డం లేదు. దీనిని సాకుగా చూపుతూ క్వింటాలుకు 10 కిలోల తరుగు తీయాలని రైస్‌ మిల్లర్లు డిమాండ్‌ చేస్తున్నారు. 


 2.72 లక్షల ఎకరాల్లో వరి సాగు


వానాకాలం జిల్లాలో 2.72 లక్షల ఎకరాల్లో వరిసాగు చేశారు. ఎకరాకు 20 నుంచి 22 క్వింటాళ్ల వరిధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయశాఖ అంచనా వేసింది. జిల్లాలో ఈ సీజన్‌లో 5.90 లక్షల మెట్రిక్‌ టన్నుల వరిధాన్యం దిగుబడి వచ్చే అవకా శం ఉంది. అందులో విత్తన పంట సుమారు 60 వేల మెట్రిక్‌ టన్నులు, రైతులు సొంత అవసరాల కు వినియోగించుకునే 70 వేల మెట్రిక్‌ టన్నుల ధాన్యం మినహాయిస్తే సుమారు నాలుగన్నర లక్షల నుంచి 4.60 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొను గోలు కేంద్రాలకు వస్తాయని అంచనా వేశారు. 


డబ్బుల చెల్లింపులో జాప్యం


ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా కొన్న ధాన్యం విలువ 461.61 కోట్లు కాగా ఇప్పటి వరకు రైతులకు కేవలం 299 కోట్ల 55 లక్షల రూపాయలు మాత్రమే చెల్లించారు. కొనుగోలు చేసిన ధాన్యం వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయడంలో జరుగుతున్న జాప్యం కారణంగా రైతులకు డబ్బు చెల్లింపులో కూడా ఆలస్యమవుతున్నది. ధాన్యం అమ్మిన 48 గం టల్లోగా డబ్బు చెల్లిస్తామని ప్రభుత్వం చెబుతు న్నా 15 రోజుల వరకు రైతులు వేచి చూడాల్సి వస్తున్న ది. ఇప్పటి వరకు 33,719 మంది రైతులు 2,35,514 మెట్రిక్‌ టన్నుల ధాన్యం విక్రయించగా ఆన్‌లైన్‌లో 30,898 మంది రైతులకు చెందిన 1,86,726 మెట్రిక్‌ టన్నుల ధాన్యం వివరాలను మాత్రమే నమోదు చేశారు. ఈ ధాన్యం విలువ 365 కోట్ల 98 

లక్షల రూపా యలు కాగా 299 కోట్ల 55 లక్షల రూపా యలు రైతుల ఖాతాల్లో జమ చేశారు. వరుస వర్షాలతో ధాన్యంలో తేమ

ప్రధానంగా తేమ కారణంగానే ధాన్యం విక్రయాల్లో ఆలస్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు.  అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాలు ఎండిన వరిధాన్యం కూడా తడవ డంతో తేమ ఆరక కొనుగోలులో జాప్యమవుతోంది. తడిసిన వరి ధాన్యం మిల్లింగ్‌ చేస్తే బియ్యం నూకగా మారుతుందని మిల్లర్లు ఆందోళన చెందుతూ దాన్యం తీసుకోవడానికి ముందుకు రావడం లేదు. 40 కిలోల బస్తాకు 4 కిలోల చొప్పున తరుగు ఇస్తేనే వారు కొనుగోలు కేంద్రాల నుంచి వచ్చిన ధాన్యాన్ని తీసుకుంటున్నారు. దీంతో క్వింటాలుకు 10 కిలోల ధాన్యాన్ని రైతులు వదులుకోవాల్సి వస్తున్నది. ఎఫ్‌సీఐకి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం బియ్యం ఇవ్వాల్సి ఉన్నందున నూక కారణంగా తాము నష్టపోతామని అందుకే తరుగు తీసుకోక తప్పడం లేదని మిల్లర్లు అంటున్నారు. 

ఈ ధాన్యాన్ని బాయిల్డ్‌ బియ్యంగా మార్చి అమ్ముదామన్నా ఎఫ్‌సీఐ వాటిని తీసుకోమని  చెప్పడంతో ధాన్యాన్ని నిరాకరించక తప్పడం లేదని వారు అంటున్నారు. మిల్లర్ల సమస్యలు మిల్లర్లకు ఉన్నా కొనుగోలు కేంద్రాల్లో వరిధాన్యం నానిపోతుండడంతో రైతులు తీవ్ర ఆందోళనకు, నష్టాలకు గురవుతున్నారు. వరి ధాన్యం తడిస్తే పూర్తిగా తీసు కునే వారే లేకుండా పోతారనే భయంతో 10 కిలోల తరుగు కూడా చెల్లించి తీవ్రంగా నష్టపోతున్నారు. తరుగు విషయంలో రైతుల గోడు పట్టించుకోవడానికి అటు కొనుగోలు కేంద్రాల నిర్వాహకులుగాని, అధికారులు గాని చేసేదేమి లేక చేతులెత్తేస్తున్నారు. 


పట్టించుకోని అధికారులు


వారం పది రోజుల్లో వరి కోతలు పూర్తి కానున్నా ఇంకా సుమారు 2 లక్షల 25 వేల టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండడంతో వాటి కొనుగోలు ప్రశ్నార్థకమేననే ఆందోళన వ్యక్తమవుతున్నది. గత సంవత్సరం కొనుగోళ్ల సమయంలో వ్యవసాయశాఖ, మార్కె టింగ్‌శాఖ అధికారులు పట్టించుకుని కొను గోళ్లు వేగవంతంగా అయ్యేలా చూశారు. ఈసారి ఆ అధికారులెవరూ కొనుగోలు కేంద్రాలవైపు చూడడం లేదు. మిల్లర్లు సహకరించకపోవడంతో కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు చేతులెత్తేస్తున్నారు. దీంతో రైతులు వేగవం తంగా ధాన్యం కొనుగోలు చేయాలని ఆందోళనలు చేపట్టక తప్పడం లేదు. ప్రభుత్వం జోక్యం చేసుకొని వరిధాన్యం మొత్తం కొనుగోలు చేయించాలని రైతులు డిమాండ్‌ చేస్తు న్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రం లో ఉన్న టీఆర్‌ఎస్‌ వర్షాకాలపు పంటను పూర్తిగా కొనుగోలు చేస్తామని ప్రకటనలు చేస్తున్నా వాస్తవ పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉన్నది. ఇంకా రెండు లక్షల పైచిలుకు టన్నుల ధాన్యం రైతుల వద్దే ఉండడం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యానికి నిదర్శనంగా ఉన్నది. 

Advertisement
Advertisement