ఉద్యోగ సంఘాల దశలవారి ఉద్యమానికి ‘హంస’ మద్దతు

ABN , First Publish Date - 2022-01-25T04:22:23+05:30 IST

ఉద్యోగ సంఘాల దశలవారి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (హంస) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ ఆసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు.

ఉద్యోగ సంఘాల దశలవారి ఉద్యమానికి ‘హంస’ మద్దతు
మాట్లాడుతున్న చేజర్ల సుధాకర్‌

నెల్లూరు(వైద్యం), జనవరి 24 : ఉద్యోగ సంఘాల దశలవారి ఉద్యమానికి ఆంధ్రప్రదేశ్‌ హెల్త్‌ అడ్మిస్ట్రేషన్‌ మెడికల్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (హంస) సంపూర్ణ మద్దతు ఇస్తుందని ఆ ఆసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు చేజర్ల సుధాకర్‌, గౌరవాధ్యక్షుడు డాక్టర్‌ అమరేంద్రనాథ్‌రెడ్డి ప్రకటించారు. సోమవారం నగరంలో 11వ వేతన సవరణ ఉత్తర్వులకు వ్యతిరేకంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ వైద్య ఆరోగ్యశాఖ లోని వైద్య సిబ్బంది, రిటైర్డ్‌ మెడికల్‌ ఎంప్లాయీస్‌, మిడ్‌లెవల్‌ హెల్త్‌ ప్రొవైడర్స్‌, పారామెడికల్‌ సిబ్బంది, ఆశా కార్యకర్తలు ప్రభుత్వ ఉద్యోగులకు సహకారం అందించాలన్నారు. పీఆర్సీ, హెచ్‌ఆర్‌ఏ, కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌, సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్‌ డిక్లరేషన్‌, అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు టైం స్కేల్‌ వంటి ప్రధాన డిమాండ్లే సాధనగా పోరాటాలు చేస్తామన్నారు. ఇందులో భాగంగా నెల 25న (మంగళవారం) నగరంలోని ఏబీఎం కాంపౌండ్‌ నుంచి ఆర్టీసీ వరకు ర్యాలీ నిర్వహించి అక్కడ ధర్నా చేస్తామని, వైద్యులు, సిబ్బంది తరలి రావాలని కోరారు. ఈ కార్యక్రమంలో హంస జిల్లా కార్యదర్శి కమల్‌ కిరణ్‌, నేతలు డాక్టర్‌ ఖాదర్‌బాషా, డాక్టర్‌ మొయిన్‌, శేషగిరిరావు, జలీల్‌ అహ్మద్‌, శివ, తిరుపతయ్య, వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-01-25T04:22:23+05:30 IST