Advertisement
Advertisement
Abn logo
Advertisement

హ్యాండ్‌బాల్‌ దళపతి జగన్‌ మోహన్‌రావుకు విశిష్ఠ పురస్కారం

హైదరాబాద్‌: దేశవ్యాప్తంగా హ్యాండ్‌బాల్‌ పురోగతికి విశేషంగా శ్రమిస్తున్న ఆ సంఘం జాతీయ అధ్యక్షుడు అరిశనపల్లి జగన్‌ మోహన్‌రావును అంతర్జాతీయ పురస్కారం వరించింది. ఆదివారం హైదరాబాద్‌లోని ఒక హోటల్‌లో జరిగిన ఇంటర్నేషనల్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన, ఫిట్‌నెస్‌ అండ్‌ స్పోర్ట్స్‌ అసోసియేషన్‌ పురస్కారాల ప్రదానోత్సవంలో జగన్‌ ఈ అవార్డును అందుకున్నారు. హ్యాండ్‌బాల్‌ దళపతిగా జగన్‌ సారథ్యం వహించినప్పటి నుంచి ఆ క్రీడకు మునుపెన్నడు లేని రీతిలో క్రేజ్‌ తీసుకురావడంతో పాటు గ్రామీణ స్థాయి క్రీడాకారులను ప్రోత్సహించడంలో ముందుండడంతో ఆయనకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేశారు. ఇక, ఆయనతో పాటు క్రీడా రంగం అభివృద్ధికి విశేష సేవలందిస్తున్న జాతీయ మాస్టర్‌ అథ్లెటిక్స్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మర్రి లక్ష్మణ్‌ రెడ్డి, డాక్టర్‌ విక్రమ్‌ సింగ్‌ (జేఎన్‌యూ, న్యూఢిల్లీ), డాక్టర్‌ జార్జ్‌ అబ్రహాం (చెన్నై వైఎంసీఏ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ ప్రిన్సిపాల్‌)కు అవార్డులు ప్రదానం చేశారు.

Advertisement
Advertisement