జిజ్ఞాసువులకు కరదీపిక

ABN , First Publish Date - 2021-08-06T05:30:00+05:30 IST

మన వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో కనిపించే వ్యక్తులు.. వారి వ్యక్తిత్వాలను పరిశీలిస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలు మనకు తెలుస్తాయి.

జిజ్ఞాసువులకు కరదీపిక

న వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో కనిపించే వ్యక్తులు.. వారి వ్యక్తిత్వాలను పరిశీలిస్తే భారతీయ సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన అనేక విషయాలు మనకు తెలుస్తాయి. వేదాలు, పురాణాలు, ఇతిహాసాల్లో ఉన్న బుషులు, పురాణ పురుషుల పేర్లు ఒకే విధంగా ఉన్నా - కాలవ్యత్యాసం వల్ల వారు వేర్వేరని గ్రహించాలి. అంతే కాకుండా మనకు ఈ గ్రంథాల్లో కనిపించే అనేక మంది పేర్లు- వారి పుట్టుకతో ఏర్పడిన శరీర నిర్మాణం వల్ల, పెద్దయిన తర్వాత వారి గుణగణాల వల్ల ఏర్పడిఉంటాయి. అంతే కాకుండా ఒకే వ్యక్తికి అనేక ఇతర నామాలు కూడా ఉంటాయి. ఇలాంటి కారణాల వల్ల చదువరులకు రకరకాల సందిగ్దతలు, సందేహాలు ఏర్పడతాయి. వీటిని తీర్చటానికి ఉద్దేశించిన ఒక గ్రంథం ‘పురాణ ప్రముఖులు’. ఈ పుస్తకంలో మనకు పూర్వగ్రంథాల్లో కనిపించే వ్యక్తులకు సంబంధించిన విశేషాలన్నింటినీ రచయిత చక్కా చెన్నకేశవరావు క్రోడీకరించారు. మన పురాణ గాథల్లో కనిపించే వ్యక్తుల గురించి తెలుసుకోవటానికి తప్పకుండా చదవాల్సిన పుస్తకమిది. 


పురాణ ప్రముఖులు

చక్కా చెన్నకేశవరావు

ప్రతులకు: 9398934721

Updated Date - 2021-08-06T05:30:00+05:30 IST