ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం

ABN , First Publish Date - 2020-12-04T05:11:06+05:30 IST

పట్టణంలోని పీహెచ్‌.వాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల భవిత కేంద్రంలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు.

ఘనంగా ప్రపంచ దివ్యాంగుల దినోత్సవం
పాయకరావుపేటలోని భవిత కేంద్రంలో విద్యార్థికి బహుమతి అందజేస్తున్న ఎంఈఓ గాంధీ

పాయకరావుపేట, డిసెంబరు 3 : పట్టణంలోని పీహెచ్‌.వాడ ప్రాథమిక పాఠశాల ఆవరణలో గల భవిత కేంద్రంలో గురువారం ప్రపంచ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఈవో కేఎన్‌.గాంధీ మాట్లాడుతూ అవయవలోపాన్ని మరచి, స్వశక్తితో గర్వంగా జీవించేందుకు ప్రయత్నించాలన్నారు. అనంతరం అలెమ్‌కో సంస్థ అందించిన వినికిడి యంత్రాలను పంపిణీ చేశారు. హెచ్‌ఎం అనంతలక్ష్మి, ఉపాధ్యాయులు, దివ్యాంగ విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.

 నక్కపల్లిలో...

నక్కపల్లి : ఇక్కడి భవిత కేంద్రంలో జరిగిన దివ్యాంగుల దినోత్సవానికి ఎంపీడీవో రమేశ్‌రామన్‌, డైట్‌ లెక్చరర్‌ మహాలక్ష్మి హాజరయ్యారు. దివ్యాంగుల కోసం ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఎంఈవో డీవీడీ ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు. 

 

గొలుగొండలో..

గొలుగొండ : దివ్యాంగులను అన్నిరంగాల్లో ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఇన్‌చార్జి ఎంఈవో అమృత్‌కుమార్‌ అన్నారు. గురువారం ఇక్కడ ఏర్పాటైన కార్యక్ర మంలో మాటా ్లడారు.  పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

 

అచ్యుతాపురంలో...

అచ్యుతాపురం : దివ్యాంగుల  దినోత్సవం సందర్భంగా ఇక్కడి భవిత కేంద్రంలో దివ్యాంగులకు క్రీడా పోటీలు నిర్వహించారు. అనంతరం ఎంఈవో దేవరాయలు విజేతలకు బహుమతులు అందజేశారు. శివానందం, జగదాంబ, ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. అలాగే. పూడిమడకలో గల వివేకానంద దివ్యాంగుల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఐదుగురికి వీల్‌చైర్లు, ఒకరికి చంక కర్ర, యాభై మంది దివ్యాంగులకు  దుప్పట్లను పీహెచ్‌సీ వైద్యాధికారిణి డాక్టర్‌ రబియాపర్వీన్‌ చేతులు మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మేరుగు నూకరాజు, బొడ్డు కొండబాబు తదితరులు పాల్గొన్నారు. 

 

రాంబిల్లిలో..

రాంబిల్లి : మండల కేంద్రమైన రాంబిల్లిలోని భవిత కేంద్రంలో  వికలాంగుల  దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగ పిల్లలకు ఆటల పోటీలు, డ్రాయింగ్‌ పోలీలను నిర్వహించి బహుమతులు అందజేశారు. ఎంఈవో సూర్యారావు  , ఉపాధ్యాయులు వి.కుమారి, వసంత తదితరులు పాల్గొన్నారు.

 

ఎలమంచిలిలో..

ఎలమంచిలి : ఇక్కడి భవిత కేంద్రంలో నిర్వహించిన దివ్యాంగుల దినోత్సవానికి ఎంఈవో మూర్తి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. దివ్యాంగులు ఏ విషయంలోనూ తీసిపోరన్నారు. అనంతరం ఆటల పోటీల్లో విజేతలకు బహుమతులు అందజేశారు. హెచ్‌ఎం సాయిబాబా, ఉపాధ్యాయలు పాల్గొన్నారు.

 

 మునగపాకలో  

మునగపాక :  దివ్యాంగుల దినోత్సవాన్ని మునగపాక భవిత కేంద్రంలో మండల స్థాయిలో నిర్వహించారు. 184 మంది దివ్యాంగులకు పలు రకాల పోటీలను నిర్వహించి ఎంఈవో సీఆర్‌కే దేవరాయులు బహుమతులు పంపిణీ చేశారు. నలుగురికి వినికిడి యత్రాలు, నలుగురికి వీల్‌చైర్లు అందించారు. భవిత కేంద్ర నిర్వాహకులు భవానీ, దేముడుబాబు, సుమతి, సీఆర్‌పీ అచ్యుతకృష్ణ పాల్గొన్నారు. 

Updated Date - 2020-12-04T05:11:06+05:30 IST