ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం

ABN , First Publish Date - 2020-09-19T00:08:55+05:30 IST

ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. జిల్లాలోని కొల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు.

ఏపీలో కొనసాగుతున్న విగ్రహాల ధ్వంసం

అనంతపురం: ఏపీలో విగ్రహాల ధ్వంసం కొనసాగుతోంది. జిల్లాలోని కొల్లూరు ఆంజనేయస్వామి ఆలయంలో విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. గురువారం అమావాస్య కావడంతో దేవాలయ ప్రాంగణంలోని ధ్వజస్థంభం వద్ద పూజల చేశారు. ఆంజనేయస్వామి విగ్రహం తలభాగాన్ని దుండగులు వేరు చేశారు. కల్యాణదుర్గం మండలం బొట్టువానపల్లిలో ఈ ఘటన జరిగింది. దేవాలయం పైభాగంలోని రామ, లక్ష్మణ, సీత విగ్రహాల పక్కన ఆంజనేయ విగ్రహం ఉండగా దాన్ని ఎత్తుకు వచ్చి ధ్వంసం చేశారు. ఈ ఘటనను స్థానికులు శుక్రవారం గమనించారు. ఆంజనేయస్వామి విగ్రహ ధ్వంసంపై గ్రామస్తులు ఆందోళనలో ఉన్నారు.


కృష్ణాజిల్లా వత్సవాయి మండలం మక్కపేటలోని కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయం తాళాలను పగలగొట్టిన గుర్తు తెలియని దుండగులు నందీశ్వరుని విగ్రహాన్ని పాక్షికంగా ధ్వంసం చేశారు. బుధవారం రాత్రి జరిగిన ఈ ఘటనను అర్చకుడు అత్తలూరి యుగంధర్‌ శర్మ గురువారం ఉదయం గుర్తించారు. వెంటనే ఈవో  పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Updated Date - 2020-09-19T00:08:55+05:30 IST