భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి

ABN , First Publish Date - 2020-05-18T11:06:20+05:30 IST

హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఊరూరా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు.

భక్తిశ్రద్ధలతో హనుమజ్జయంతి

నిరాడంబరంగా వేడుకలు.. కరోనా నుంచి కాపాడాలని పూజలు


కీసర/ఘట్‌కేసర్‌ రూరల్‌/ఘట్‌కేసర్‌/కీసర రూరల్‌/శామీర్‌పేట: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఊరూరా ఆలయాల్లో భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. సుప్రసిద్ధ శైవక్షేత్రమైన కీసరగుట్ట రామలింగేశ్వర స్వామి ఆలయంలో హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ చైర్మన్‌ తటాకం శ్రీనివాస్‌ శర్మ అధ్వర్యంలో క్షేత్రపాలకుడు శ్రీ ఆంజనేయస్వామికి నిరాండంబంరంగా పూజలు నిర్వహించారు. కరోనా నేపథ్యంలో ఘట్‌కేసర్‌లోని వివిధ గ్రామాల్లో హనుమాన్‌ జయంతి వేడుకలు నిరాడంబరంగా జరిగాయి. మర్రిపల్లిగూడ, ఎదులాబాద్‌, అంకుశాపూర్‌, అవుశాపూర్‌, వెంకటాపూర్‌, కొర్రెముల, ప్రతా్‌పసింగారం, కాచవానిసింగారం, ఘణాపూర్‌ తదితర గ్రామాల్లో పూజలు నిర్వహించారు.  కరోనా నుంచి సమాజాన్ని కాపాడాలని కోరుతూ ఘట్‌కేసర్‌ మండలం అవుశాపూర్‌లోని ఉమామహేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఘట్‌కేసర్‌ పట్టణంలో  భజరంగ్‌దళ్‌ జిల్లా కో-కన్వీనర్‌ పసులాది చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు.


ఈ కార్యక్రమాన్ని వీహెచ్‌పీ జంటనగరాల అధ్యక్షుడు శ్రీనివా్‌సరాజా ప్రారంభించారు. 50 మంది యువకులు రక్తదానం చేశారు. సేకరించిన రక్తాన్నా నాగోల్‌లోని ఎస్‌ఎల్‌ఎఎంఎస్‌, మేడిపల్లిలోని శ్రీ సాయి బ్లండ్‌ బ్యాంకులకు అప్పగించనున్నట్లు తెలిపారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని దాదాపు 600మందికి ఆహార ప్కాకెట్లు పంపిణీ చేయటంతో పాటు 150మంది కూలీలకు సరుకులు పంపిణీ చేసినట్టు భజరంగ్‌దళ్‌ ప్రతినిధులు తెలిపారు. ఘట్‌కేసర్‌, పోచారం మున్సిపాలిటీల్లో హనుమాన్‌ జయంతిని నిరాడంబరంగా నిర్వహించారు. శివారెడ్డిగూడ దండ్లగడ్డ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం, పోచారంలోని స్పటికలింగేశ్వరాలయంలో, ఎన్‌ఎ్‌ఫసీనగర్‌లోని శివాలయం ఆవరణలోని పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహానికి భక్తులు పూజలు చేశారు. స్ఫటికలింగేశ్వరాలయంలో స్వామివారిని తమలపాకులతో అలంకరించారు. నాగారం, దమ్మాయిగూడ మున్సిపాలిటీల్లో హనుమాన్‌ జయంతిని నిర్వహించారు. రాంపల్లి సీతారామాంజనేయస్వామి ఆలయంలో హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. తూంకుంట మునిసిపాలిటీ పరిధి దేవరయంజాల్‌లోని వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ హనుమాన్‌ విగ్రహానికి పూలమాలలను వేసి పూజలు చేశారు. 


అభిషేకాలు.. పూజలు

కొడంగల్‌: హనుమాన్‌ జయంతిని పురస్కరించుకొని స్థానిక శ్రీమహాలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలో గల వీరాంజనేయస్వామికి టీటీడీ ప్రధాన అర్చకులు సుందర వరద భట్టాచార్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారికి సుంగధం ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. 


హనుమాన్‌ చాలీసా పారాయణం

చేవెళ్ల/కడ్తాల్‌/షాద్‌నగర్‌: హనుమాన్‌ జయంతి వేడుకలను భజరంగ్‌దళ్‌ కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు. మండల పరిధిలోని తంగడ్‌పల్లిలో అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. అనంతరం కరోన దూరం కావాలని భక్తులు హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. హనుమాన్‌ జయంతి వేడుకలు కడ్తాల మండల కేంద్రంలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. హనుమాన్‌ జయంతిని భక్తులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. షాద్‌నగర్‌ పట్టణంలోని ఆంజనేయస్వామి ఆలయాల్లో అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు. హాజిపల్లి రహదారి సమీపంలో విజయ్‌నగర్‌ కాలనీలోని హనుమాన్‌ ఆలయంలో అర్చకులు ఎంసీఏ శర్మ, వెంకటకృష్ణ నేతృత్వంలో అభిషేకం, అర్చన నిర్వహించారు. కరోనా మహమ్మారిని తరమికొట్టి ప్రజలను రక్షించాలని ప్రార్థించారు. 


ఆధ్యాత్మిక సంపదే దివ్య ఔషధం

హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ

యాచారం : సమాజంలో జరుగుతున్న అనేక సామాజిక రుగ్మతులకు అనాదిగా వస్తున్న భారతీయ ఆధ్యాత్మిక సంపదనే దివ్య ఔషదమని హంపి పీఠాధిపతి విద్యారణ్య భారతీ స్వామిజీ పేర్కొన్నారు. హనుమాన్‌ జయంతిని పురస్కరించుకుని ఆదివారం మండల పరిధి నంది వనపర్తి గ్రామంలోని హనుమాన్‌ ఆలయంలో జ్ఞాన సరస్వతి సేవా ట్రస్టు అధ్వర్యంలో నిర్వహించిన హనుమాన్‌ జయంతి పూజా కార్యక్రమంలో స్వామిజీ పాల్గొన్నారు. భౌతిక దూరం పాటిస్తూనే ఆకు పూజ, హనుమాన్‌ చాలీసా పారాయణం చేశారు. అనంతరం గ్రామంలోని పారిశుధ్య సిబ్బందికి నిత్యావసరాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ వ్యవస్థాపకులు సదా వెంకట్‌రెడ్డి, మండలి సభ్యులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-05-18T11:06:20+05:30 IST