ఘనంగా స్నేహితుల దినోత్సవం

ABN , First Publish Date - 2021-08-02T06:33:40+05:30 IST

మండల పరిఽధిలోని కంచెర్లవారిపల్లి హైస్కూల్‌ల్లో 2002-03 10వ తరగతి పూర్వ విధ్యార్ధులు ఆదివారం ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు.

ఘనంగా స్నేహితుల దినోత్సవం
కేక్‌ను కట్‌ చేస్తున్న ఉపాధ్యాయుడు వేణు

కనిగిరి, ఆగస్టు 1: మండల పరిఽధిలోని కంచెర్లవారిపల్లి హైస్కూల్‌ల్లో 2002-03 10వ తరగతి పూర్వ విధ్యార్ధులు ఆదివారం ఘనంగా స్నేహితుల దినోత్సవం జరుపుకున్నారు. ఈ సందర్భంగా తమ ఉపాధ్యాయుడు వేణు చేతుల మీదగా స్నేహితుల దినోత్సవ కేక్‌ను కట్‌చేయించారు. ఈ సందర్భంగా పాల్గొన్న ఉపాధ్యాయుడు వేణు మాట్లాడుతూ అన్ని బంధాల కంటే స్నేహబంధం ఎంతో విలువైనదన్నారు. . మంచి స్నేహితుడు ప్రతివ్యక్తికి ఒక్కరు ఉన్నా ఎంతో భరోసాగా ఉంటుందన్నారు. తమ కష్టసుఖాలను పంచుకొనే స్నేహితుడు ఉన్నప్పుడు మనలో ఆత్మస్థైర్యం పెరుగుతుందన్నారు. స్నేహితుడు ఇచ్చిన ధైర్యంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారు ఎందరో ఉన్నారన్నారు. స్నేహంలో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చినా సర్ధుకుపోవాలన్నారు. నేడు తమ పాఠశాలలో తమతో పాటు చదువుకున్న స్నేహితులు అందరూ కలిసి స్నేహితుల దినోత్సవం జరుపు కోవడం గొప్ప విషయమన్నారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు ధనుంజయ్‌, కృష్ణ, శేఖర్‌, రామకృష్ణ, ఏడుకొండలు, ఈశ్వరరావు, హరిబాబు, బాలు, రమణయ్య, రవీంద్రారెడ్డి, నాగార్జున తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-08-02T06:33:40+05:30 IST