Abn logo
Sep 28 2021 @ 00:00AM

హ్యాపీ హ్యాపీ హార్మోన్స్‌

మనసు ఉరకలేయాలంటే శరీరంలో హ్యాపీ హార్మోన్లు సరిపడా ఉండాలి. ఈ హార్మోన్లను చురుగ్గా ఉంచాలంటే వాటిని ఉత్తేజితపరిచే పనులు చేయాలి. అవేంటంటే...


డోపమైన్‌

దీన్ని రివార్డ్‌ రసాయనం అంటారు. మనల్ని మనం సంతోషపరుచుకోవడం ద్వారా ప్రతిఫలం రూపంలో ఈ హార్మోన్‌ ఉత్పత్తి అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ హ్యాపీ హార్మోన్‌ కోసం...


 ఏదైనా పని సమర్థంగా ముగించాలి.

 ఏదైనా సెల్ఫ్‌ కేర్‌ యాక్టివిటీ (బ్యూటీ ట్రీట్మెంట్‌, వ్యాయామం)లో పాల్గొనాలి. 

 ఆహారాన్ని ఆస్వాదించాలి.

 చిన్న చిన్న విజయాలను సెలబ్రేట్‌ చేసుకోవాలి.


        ఎండార్ఫిన్‌

ఇది నొప్పి నివారిణి. ఈ హార్మోన్‌ ఉత్పత్తి కోసం....

 గట్టిగా నవ్వాలి.

 ఎసెన్షియల్‌ ఆయిల్స్‌ వాడుకోవాలి.

 నవ్వు తెప్పించే కామెడీ షోలు చూడాలి

 డార్క్‌ చాక్లెట్‌ తినాలి.

 వ్యాయామం చేయాలి.


      సెరటోనిన్‌

ఇది భావోద్వేగాలను అదుపులో ఉంచుతుంది. ఈ హార్మోన్‌ ఉత్పత్తి కోసం...

 ధ్యానం చేయాలి.

 పరిగెత్తాలి.

 ఎండ సోకనివ్వాలి.

 ప్రకృతిలో నడవాలి.

 ఈత కొట్టాలి.

 సైకిల్‌ తొక్కాలి.



ఆక్సిటోసిన్‌

దీన్ని లవ్‌ హార్మోన్‌ అంటారు. మనసును ఉల్లాసపరిచే ఈ హార్మోన్‌ ఉత్పత్తి కోసం...

 పెంపుడు కుక్కతో ఆడుకోవాలి.

 పిల్లలతో ఆడాలి.

 నచ్చిన వారితో చేతులు కలపాలి.

 కుటుంబసభ్యులను హత్తుకోవాలి.

 అభినందించాలి.