మెడికల్‌ కళాశాల మంజూరుపై హర్షం

ABN , First Publish Date - 2022-03-08T06:17:55+05:30 IST

గద్వాల జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 2023 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అవుతుందని తెలి పారు.

మెడికల్‌ కళాశాల మంజూరుపై హర్షం
గద్వాల పట్టణంలో సంబురాలు చేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ నాయకులు

- సీఎం కేసీఆర్‌కు జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, అబ్రహాం కృతజ్ఞతలు 

- హర్షం ప్రకటించిన ప్రజా సంఘాలు 

గద్వాల/గద్వాల టౌన్‌/అలంపూర్‌ చౌరస్తా, మార్చి 7 : గద్వాల జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక శాఖ మంత్రి హరీశ్‌రావు సోమవారం అసెంబ్లీలో బడ్జెట్‌ ప్రసంగంలో ప్రకటించారు. 2023 విద్యాసంవత్సరం నుంచి ప్రారంభం అవుతుందని తెలి పారు. ఈ సంద ర్భంగా జడ్పీ చైర్‌పర్సన్‌ సరిత, గద్వా ల ఎమ్మెల్యే కృష్ణ మోహన్‌రెడ్డి సంతోషం వ్వక్తం చేశా రు. సీఎం కేసీఆర్‌కు, ఆర్ధిక శాఖ మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. నిరుపేద ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోందని, అందులో  భాగంగానే మెడికల్‌ కళాశాలను మంజూరు చేశారని చైర్‌పర్సన్‌ సరిత అన్నారు. గద్వాల ప్రజలు వైద్యం కోసం పక్క రాష్ర్టానికి పోవాల్సిన పరి స్థితి ఏళ్లుగా కొనసాగుతోందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణ మోహన్‌రెడ్డి అన్నారు. వైద్య కళాశాల ఏర్పాటుతో  గద్వాల ప్రజలకు మెరుగైన వైద్యం అందుతుందని అన్నారు. ఇప్పటికే నర్సింగ్‌ కళాశాల మంజూరైందని, మంత్రి కేటీఆర్‌ చేతుల మీదుగా భవన నిర్మాణానికి శంకుస్థాపనలు జరిగాయని తెలిపారు. 


మెడికల్‌ కాలేజీ మంజూరు గర్వకారణం

నడిగడ్డ ప్రాంతానికి మెడికల్‌ కాలేజీ రావడం గర్వకారణమని అలంపూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ అబ్రహాం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. బంగారు తెలంగాణలో సంక్షేమ ఫలాలతో పాటు అభివృద్ధి ఫలాలు అన్ని వర్గాలకు, అన్ని ప్రాంతాలకు అందుతున్నాయని చెప్పారు. గద్వాల్‌కు మెడికల్‌ కాలేజీని ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేశారు. 

నడిగడ్డ అభివృద్ధే ముఖ్యమంత్రి లక్ష్యం

నడిగడ్డ ప్రజల అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్‌ లభ్యమని, ఆయనకు రుణపడి ఉంటామని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చొరవతో గట్టు ఎత్తిపోతల పథకానికి రూ. 700 కోట్లు కేటాయిస్తూ, త్వరలో పనులను ప్రారంభించనున్నట్లు తెలిపారు. నడిగడ్డ ప్రజల చిరకాల వాంఛ అయిన మెడికల్‌ కళాశాల ప్రకటనతో పాటు నర్సింగ్‌ కళాశాల, 300 పడకల ఆసుపత్రి, పీజీ కళాశాల, ఎంబీఏ కోర్సుల మంజూరు, డిగ్రీ కళాశాలకు అదనపు గదుల నిర్మాణం చేపట్టడంలో ముఖ్యమంత్రి కృషి మరువలేనిదన్నారు. దళిత బంధుకోసం 17,700 కోట్లు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేసారు. సమావేశంలో మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు పాల్గొన్నారు. 


జిల్లా కేంద్రంలో సంబురాలు 

జోగుళాంబ గద్వాల జిల్లాకు మెడికల్‌ కళాశాలను మంజూరు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి తన్నీరు హరీశ్‌ రావు సోమవారం బడ్జెట్‌లో ప్రకటించడం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమైంది. మునిసిపల్‌ చైర్మన్‌ బీఎస్‌ కేశవ్‌ ఆధ్వర్యంలో కౌన్సిలర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు, గద్వాల పట్టణంలోని పాత బస్టాండ్‌ సర్కిల్‌లో బాణా సంచా పేల్చి మిఠాయిలు పంచుకున్నారు. జేఏసీ జిల్లా అధ్యక్షు డు, న్యాయవాది మధుసూదన్‌బాబు స్వాగతించారు. సీనియర్‌ సిటిజన్స్‌ ఫోరం అధ్యక్షుడు మోహన్‌ రావు, మాజీ కౌన్సిలర్‌ భీంసేన్‌రావు, ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బాలగోపాల్‌ రెడ్డి, మెడికల్‌ కళా శాల సాధన సమితి నాయకులు హర్షం చేశారు. ఎమ్మె ల్యే బండ్ల కృష్ణమోహన్‌ రెడ్డి, జిల్లా ఇన్‌చార్జి మంత్రి నిరంజన్‌రెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. 


సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

రాష్ట్ర ప్రభుత్వం చేనేత కుటుంబాలకు బీమా పథకాన్ని ప్రవేశపెట్టడంపై చేనేత కార్మికులు సంతోషం వ్యక్తం చేశారు. చేనేత కార్మికు లకు రూ.5లక్షల బీమా సౌకర్యం కల్పించాలని నిర్ణయిం చడం హర్షదాయకమని చేనేత సమతా సేవా సంఘం కన్వీనర్‌ రాధ అన్నారు. అందుకు కృతజ్ఞతలు తెలు పుతూ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. కార్యక్రమంలో చేనేత సహకార సంఘం నాయకులు అక్కల శాంతారం, శ్రీనివాసులు పాల్గొన్నారు. 


Updated Date - 2022-03-08T06:17:55+05:30 IST